Asianet News TeluguAsianet News Telugu

(వీడియో) సౌతిండియా దోసెకు నమస్కారం

భారత దేశంలో నలుమూలలా మెచ్చిన టిపిన్ఐటెం... పేపర్ పల్చగా, దోరగా వేగి కరకరలాడుతూ కనిపించే దోసేయే.. అది మసాలా కావచ్చు,సాదా కావచ్చు, ఈ మధ్య వివిధ అవతారాలెత్తుతున్న దక్షిణ భారత దోసె కావచ్చు. ఇదంతా చూస్తే దోసేకొక నమస్కారం పెట్టకుండా ఉండలేం.

In the praise of south Indian delicacy dosa

 

భారత దేశంలో నలుమూలలా మెచ్చిన టిపిన్ఐటెం... పేపర్ పల్చగా, దోరగా వేగి కరకరలాడుతూ కనిపించే దోసేయే.. అది మసాలా కావచ్చు,సాదా కావచ్చు, పేపర్ దోసె కావచ్చు.  ఈ మధ్యదేశంలో అన్ని చోట్ల ఎన్నో అవతారాలెత్తుతూ కనిపిస్తున్నది దక్షిణ భారత దోసెయే. టిపిన్ కి ఇపుడు అంతా దోసే కావాలంటున్నారు.ఢిల్లీ, ముంబయా, కోల్ కత్తా, పుణే, ఛెన్నె, బెంగుళూరు,  ఆపైన హైదరాబాద్ ... పొద్దనే టిఫిన్ తెప్పించుకోవాలంటే, మొదటి ఆర్డర్ పడుతున్నది దోసే మీదే. కొబ్బరి చట్నీ తో, వేరశనక్కారం, కారం ప్పొడి, ఎర్రకారం, సాంబార్, అల్లం చట్నీ... ఆనియన్, పన్నీర్, డ్రైఫ్రూట్, ఎగ్, చికెన్ మటన్, రొయ్యలు...ఎవరి ఇష్టానికయినా  అణకువగా వొదిగిపోయే దోసే ఇపుడు ఆల్ ఇండియా మోస్ట్ ఫేవరెట్ టిఫిన్ ఐటెం అంటున్నారు స్విగ్గీ. దేశవ్యాప్తంగా ఉన్న 8 ప్రధాన నగరాల్లోని 12 వేల రెస్టారెంట్లలో టిఫిన్ ఆర్డర్ల మీద ఆన్‌లైన్ సర్వే చేస్తే దోసే కే ఎక్కువ వోట్లు పడ్డాయి. ఒకవేళ దోశ లేదనుకుంటే మాత్రం అప్పుడు పోహా, పరోటాలు తీసుకుంటున్నారు.వినియోగదారులెక్కుగా కోరుకుంటున్నది, కొంటున్నది దోసేనే. ఇంక బెంగళూరు దోసె గురించి చెప్పనవసరమే లేదు. ఈ వీడియో చూడండి మీకే తెలుస్తుంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios