ప్రాంక్ వీడియో తీసి.. అందర్నీ ఫూల్స్ చేద్దాం అనుకున్నాడు

First Published 29, Mar 2018, 3:12 PM IST
In-N-Out Burger sues YouTube prankster for posing as CEO
Highlights
కానీ.. అడ్డంగా బుక్కయ్యాడు

ప్రాంక్ వీడియోలు తీసి.. అందర్నీ ఫూల్స్ చేయడం.. ఈ తర్వాత వాటిని యూట్యూబ్ లో పోస్టు చేసి.. లక్షలకు లక్షలు వ్యూస్ సంపాదించడం ఈ మధ్యకాలంలో అందరికీ బాగా అలవాటు అయిపోయింది.  ఇలాంటి ప్రయోగమే చేసి ఓ వ్యక్తి అడ్డంగా బుకయ్యాడు. బుక్కవ్వడమే కాదు..  ప్రాంక్ వీడియో తీసినందుకు ఫైన్ కూడా కట్టాల్సి వచ్చింది. ఈ సంఘటన  కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. పూర్తివివరాల్లోకి వెళితే..

ఏప్రిల్ 1వ తేదీన ఫూల్స్ డే అన్న విషయం అందరికీ తెలిసిందే. కాగా.. ఈలోపు ఏదైనా ప్రాంక్ వీడియో తీసి.. దానిని ఏప్రిల్ 1వ తేదీన యూట్యూమ్ లో పోస్టు చేయాలని ఓ సంస్థ భావించింది. ఇందులో భాగంగానే రియోడర్ అనే వ్యక్తి ఈ నెల మార్చి 13, 14వ తేదీల్లో కాలిఫోర్నియాలోని రెండు వేరు వేరు ప్రాంతాల్లో.. ‘ఇన్ అండ్ అవుట్ బర్గర్స్’ ఫుడ్ రెస్టారెంట్ కి వెళ్లాడు. ఈ రెస్టారెంట్ సీఈవో తానే అంటూ హడావిడి చేశాడు.

కష్టమర్ల దగ్గర బర్గర్లు బలవంతంగా లాక్కొని.. టేస్టు చూడాలనే వంకతో తినేసాడు. అతని ప్రవర్తనకు కష్టమర్లంతా ఖంగుతున్నారు. కాగా.. ఈ విషయం రెస్టారెంట్ అసల యజమానికి తెలియడంతో వారిపై కేసు పెట్టారు. తమ రెస్టారెంట్ కి వచ్చి... కష్టమర్లను ఇబ్బంది పెట్టారని ఆయన ఆరోపించాడు. అందుకు ప్రతిఫలంగా 25వేల డాలర్లు చెల్లించాల్సిందిగా డిమాండ్ చేశాడు. దీంతో ఈ యూట్యూబ్ ఛానెల్ కూడా తప్పనిసరిగా చెల్లించాల్సి వచ్చింది.

loader