ఒక్కసారిగా దేశంలో ఆల్కహాల్ బ్యాన్ చేస్తే..?

First Published 11, Dec 2017, 12:46 PM IST
If Alcohol Were Banned Twitter Imagines Hilarious Scenarios
Highlights
  • నెటిజన్ల స్పందన ఎలా ఉందో తెలుసా..?

ప్రస్తుత కాలంలో మద్యం తాగనివాళ్లు చాలా అరుదుగా కనిపిస్తున్నారు. ఆడ, మగ అని తేడాలేకుండా మద్యం మత్తులో మునిగి తేలుతున్నారు. అలాంటిది ఒక్కసారిగా దేశంలో ఒక్క చుక్క కూడా మద్యం అన్నది లేకుండా చేస్తే.. ఎలా ఉంటుంది? నిజంగా అదే జరిగితే దేశ వ్యాప్తంగా ప్రజలు ఎలా ఫీలౌతారో  తెలుసా? ఇదే ఆలోచన ట్విట్టర్ కి వచ్చింది. వెంటనే ఈ ఆలోచనను ఆచరణలో పెట్టింది. ట్విట్టర్ లో ‘‘ ఇఫ్ ఆల్కహాల్ వర్ బ్యాన్డ్’’ అనే హ్యాష్ ట్యాగ్ పెట్టింది.  దీనికి నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. నెటిజన్లు ఆసక్తికరమైన ట్వీట్లు చేస్తున్నారు.

వాటిలో కొన్ని ట్వీట్స్ చూద్దామా..

‘‘ దేశవ్యాప్తంగా ఆల్కహాన్ బ్యాన్ చేస్తే.. పంజాబీలు పెళ్లి చేసుకోవడం మానేస్తారు.’’

‘‘ ఇండియన్ వెడ్డింగ్స్ లో చాలా మంది నాగిని డ్యాన్స్ చేయడం ఆనవాయితిగా వస్తోంది. ఆల్కహాల్ బ్యాన్ చేస్తే.. నాగిని డ్యాన్స్ అంతరించి పోతుంది.’’

‘‘ కిన్లే సోడా ఒంటరిది అయిపోతుంది’’

‘‘ పాప్ సింగర్ హనీ సింగ్.. భజన పాటలు పాడటం మొదలుపెడతాడు’’

‘‘ లవ్  బ్రేకప్ లను ఎలా డీల్ చేయాలి’’

‘‘ గోవా బోరింగ్ కి మారుపేరుగా మారుతుంది’’

‘‘  ఆల్కహాల్ బ్యాన్ అనే ఈ హ్యాష్ ట్యాగ్ డీమానిటైజేషన్ లాగే భయపెడుతోంది’’ అంటూ కొందరు ట్వీట్ చేయగా.. మరికొందరు మాత్రం మద్యం నిషేధించడం మంచిదేనంటూ ట్వీట్ చేశారు.

‘’ నేరాలు తగ్గుతాయి, మహిళల భద్రత పెరుగుతుంది. నిరుద్యోగ శాతం తగ్గుతుంది. హ్యాపీ ఫ్యామిలీస్, హ్యాపీ సొసైటీని చూడగలుగుతాం.’’ అంటూ కొందరు ట్వీట్ చేశారు.

loader