ఐడియా యూజర్స్ కి మ్యాజిక్ ఆఫర్

Ideas Magic Cashback offer to give up to Rs 3300 on recharge of Rs 398 and above
Highlights

  • బంపర్ ఆఫర్ ప్రకటించిన ఐడియా
  • రూ.398తో రీచార్జ్ చేసుకుంటే.. రూ.3,300 క్యాష్ బ్యాక్

ప్రముఖ టెలికాం సంస్థ ఐడియా.. తమ వినియోగదారులకు మ్యాజిక్ ఆఫర్ ని ప్రకటించింది. ఎయిర్ టెల్, జియోకి పోటీగా క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. నిన్న, మొన్నటి వరకు కొత్త కొత్త ప్లాన్లతో వినియోగదారులను ఆకట్టుకున్న టెలికాం  సంస్థలు తాజాగా క్యాష్ బ్యాక్ బాట పట్టిన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు అదే బాటలో ఐడియా కూడా చేరింది. 'మ్యాజిక్‌ క్యాష్‌బ్యాక్‌' ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌ కింద 3,300 రూపాయల విలువైన క్యాష్‌బ్యాక్‌ను అందించనున్నట్టు తెలిపింది. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లు, పలు ఆన్‌లైన్‌ ఛానళ్లను వాడుతూ 398 రూపాయలు, ఆపై మొత్తాలతో కూడిన అపరిమిత ప్లాన్లను రీఛార్జ్‌ చేసుకున్న కస్టమర్లకు ఈ క్యాష్‌బ్యాక్‌ లభిస్తుందని ఐడియా పేర్కొంది. క్యాష్‌బ్యాక్‌ కింద 50 రూపాయలతో కూడిన ఎనిమిది డిస్కౌంట్‌ ఓచర్లను అందించనున్నట్టు తెలిపింది. ఈ డిస్కౌంట్‌ ఓచర్లను కస్టమర్లు తర్వాత రీఛార్జ్‌ చేయించుకునే 300 రూపాయలు, ఆపై మొత్తాలపై ఏడాదిపాటు రిడీమ్‌ చేసుకోవచ్చు.

అంతేకాక 2,700 రూపాయల విలువైన ఐదు షాపింగ్‌ కూపన్లను కూడా అందించనున్నట్టు తెలిపింది. వీటిని తమ పార్టనర్‌ స్లోర్లు లేదా వెబ్‌సైట్లలో వినియోగించుకోవచ్చని కుమార్‌మంగళం బిర్లా చెప్పారు. మై ఐడియా యాప్‌ లేదా కంపెనీ వెబ్‌సైట్‌ ద్వారా రీఛార్జ్‌ చేయించుకున్న కస్టమర్లకు, 200 రూపాయల వరకు వాలెట్‌ క్యాష్‌బ్యాక్‌ లభించనుంది. 398 రూపాయల ప్లాన్‌ కింద ఐడియా అపరిమిత వాయిస్‌ కాల్స్‌(లోకల్‌, ఎస్టీడీ, నేషనల్‌ రోమింగ్‌ కాల్స్‌)ను, రోజుకు 1జీబీ డేటాను, 100 ఎస్‌ఎంఎస్‌లను 70 రోజుల పాటు అందించనుంది. ఈ మ్యాజిక్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ ఐడియా ప్రీపెయిడ్‌ కస్టమర్లందరికీ 2018 ఫిబ్రవరి 10 వరకు అందుబాటులో ఉండనుంది.

loader