ప్రముఖ టెలికాం సంస్థలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు నానా అవస్థలు పడుతున్నాయి. నిన్న,మొన్నటి దాకా.. కొత్త కొత్త ప్లాన్లను పరిచయం చేస్తూ.. మొబైల్ డేటా ని ఎక్కువ మొత్తంలో అందిస్తూ వచ్చిన టెలికాం సంస్థలు ఇప్పుడు క్యాష్ బ్యాక్ ఆఫర్ల మీద పడ్డాయి.

ఇటీవల జియో.. ‘‘ ఫుట్ బాల్’’ పేరిట ఒక ఆఫర్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆఫర్ లో రెడ్ మీ నోట్5, రెడ్ మీ నోట్ 5 ప్రో ఫోన్లతో పాటు కొత్తగా విడుదలౌతున్న 4జీ స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసిన వారికి రూ.2200 క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కాగా.. ఇప్పుడు జియోకి పోటీగా ఐడియా కూడా ఒక క్యాష్ బ్యాక్ ఆఫర్ తీసుకువచ్చింది.

కొత్తగా విడుదలైన 4జీ స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసిన ఐడియా కష్టమర్లు.. 18నెలల పాటు రూ.199తో రీఛార్జ్ చేసుకోవాలి. అలా చేసుకుంటే.. వారికి రూ.2వేలు క్యాష్ బ్యాక్ ఇస్తామని ఐడియా ప్రకటించింది. ఈ రూ.199 ప్లాన్ లో కష్టమర్లకు అపరిమితమైన local, ఎస్.టి.డి కాల్స్ తో పాటు, ప్రతిరోజు 1.4జీబీ మొబైల్ డేటా, రోజుకి వంద ఎస్ఎంఎస్ లు లభిస్తాయి.