ప్రముఖ టెలికాం సంస్థలు జియో, ఎయిర్ టెల్ లు.. కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆఫర్లు ప్రకటించడంలో మొన్నటిదాకా వెనకపడిన ఐడియా.. ఇప్పుడు ఇతర టెలికాం సంస్థలకు షాకిస్తోంది. ఇటీవలే ఒక ప్లాన్ ని ప్రవేశపెట్టిన ఐడియా.. తాజాగా మరో ప్లాన్ ని ప్రవేశపెట్టింది. ప్రత్యేకంగా ఈ ప్లాన్ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ఐడియా వినియోగదారులకు మాత్రమే లభిస్తుండటం విశేషం.

ఈ ప్లాన్ ప్రకారం 109 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకుంటే ప్రతిరోజు 1 జీబీ మొబైల్ డేటాతో పాటు అపరిమితమైన వాయిస్ కాల్స్, రోజుకి 100 ఎస్ఎంఎస్ లు ఉచితంగా లభిస్తాయి. అయితే ఈ ప్లాన్ 14 రోజులపాటు మాత్రమే వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. గతంలో ఐడియా సంస్థ ప్రకటించిన 93 రూపాయల ప్లాన్ మాదిరిగానే ఇది కూడా ఉన్నప్పటికీ, ఆ ప్లాన్‌కి కేవలం 10 రోజుల వ్యాలిడిటీ మాత్రమే లభించేది. వాస్తవానికి రిలయన్స్ జియో 98 రూపాయలకు అందిస్తున్న ప్లాన్‌తో పోల్చుకుంటే ఇది కొద్దిగా మెరుగైనదనే చెప్పుకోవాలి. 98 రూపాయలకు రిలయన్స్ జియో సంస్థ 28 రోజులపాటు వాడుకోగలిగేలా కేవలం 2GB మొబైల్ డేటా మాత్రమే అందిస్తోంది. ఈ లెక్కన ఐడియా కూడా జియోకి గట్టిపోటీనే ఇస్తోంది.