టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఐసీసీ అత్యుత్తమ అవార్డును అందజేసింది. కోహ్లీ.. క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచారు. ఐసీసీ గురువారం ప్రతిష్టాత్మక అవార్డులను ప్రకటించింది. 2017లో క్రికెట్ లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన క్రికెటర్లకు ఈ అవార్డ్ లను ప్రకటించింది. 2017లో అంతర్జాతీయ క్రికెట్లో అద్భుత ప్రదర్శన కనబరిచినందుకుగాను ఐసీసీ సర్‌ గార్‌ఫీల్డ్‌ సోబెర్స్‌ ట్రోఫీని అందుకున్నాడు. టెస్టు, వన్డే, టీ20 ఈ మూడు ఫార్మాట్లలోనూ విశేష ప్రతిభ కనబరిచిన ఆడటగాడికి ఐసీసీ ఈ అవార్డు అందజేస్తోంది. దీన్ని కోహ్లి కైవసం చేసుకోవడం ఇదే తొలిసారి. అలాగే ఐసీసీ వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డును కోహ్లీ దక్కించుకున్నాడు. కోహ్లీకి ఈ అవార్డు దక్కడం ఇది రెండోసారి. 2012లో చేసిన ప్రదర్శనకు గాను కోహ్లీ మొదటిసారి ఈ అవార్డును దక్కించుకున్నాడు.

మరో పక్క భారత యువ ఆటగాడు యుజ్వేంద్ర చాహల్‌ ఐసీసీ టీ20 ఫర్‌ఫామెన్స్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు అందుకున్నాడు. బెంగళూరులో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20లో చాహల్‌ అద్భుత ప్రదర్శన చేశాడు. 25 పరుగులిచ్చి 6 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ప్రదర్శనకుగాను చాహల్‌ అవార్డు అందుకున్నాడు. వీరితోపాటు మరికొందరికి కూడా ఐసీసీ అవార్డులు అందజేసింది. ఆస్ట్రేలియా క్రికెటర్ కి ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, ఆఫ్ఘనిస్థాన్  క్రికెటర్ రషీద్ ఖాన్ కి ఐసీసీ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, పాకిస్థాన్ క్రికెటర్ హాసన్ అలీ కి ఎమర్జింగ్ క్రికెటర ఆఫ్ ది ఇయర్ అవార్డులను అందజేసింది.