ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ ఐబాల్ సంస్థ భారత మార్కెట్లోకి సరికొత్త ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. 'కాంప్‌బుక్ ప్రీమియో వి2.0' పేరుతో విడుదల చేసిన ఈ ల్యాప్ టాప్ ని బడ్జెట్ ధరలోనే అందిస్తోంది. ల్యాప్ టాప్ ధర రూ.21,999 గా ప్రకటించింది. ​వ్యాపారస్తులు, విద్యార్థులు, గృహిణులు ల‌క్ష్యంగా దీనిని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా ఈ ల్యాప్‌టాప్ పనిచేస్తోంది.​ ​ 

'కాంప్‌బుక్ ప్రీమియో వి2.0' ఫీచర్లు:

14 ఇంచెస్ హెచ్ డీ డీస్ ప్లే

1366 x768పిక్సల్స్ రెజల్యూషన్

మల్టీ టచ్ ఫంక్షనాలిటీ

4జీబీ ర్యామ్

32జీబీ స్టోరేజ్ సామర్థ్యం

128 ఎక్స్ పాండబుల్ స్టోరేజీ సామర్థ్యం

0.3 మెగిపిక్సెల్ వెబ్ కెమేరా