షియోమి స్మార్ట్ ఫోన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్

i A1 discontinued in India as Xiaomi set to launch Mi A2
Highlights

ఆ ఫోన్ అమ్మకాలను నిలిపేసిన షియోమి

చైనాకి చెందిన ప్రముఖ ఎలెక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ షియోమి..స్మార్ట్ ఫోన్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. షియోమి కంపెనీకి చెందిన ఎంఐ ఏ1 స్మార్ట్ ఫోన్ అమ్మకాలను నిలిపివేసింది. భారత మార్కెట్లో షియోమి విడుదల చేసిన తొలి ఆండ్రాయిడ్  వన్ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ ఇదే. కాగా.. ఈ ఫోన్ తర్వాత షియోమి నుంచి చాలా ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. ఎప్పటికప్పుడు కొత్త ఫోన్ మార్కెట్లోకి రావడంతో.. కొత్తవాటిని కొనుగోలు చేయడానికే వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో.. పాత మోడళ్లు కొనుగోళ్లు ఆగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే తమ పాత మోడల్ అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు  షియోమి ప్రకటించింది. అయితే.. ఇప్పటి వరకు లాంచ్‌చేసిన ఏ స్మార్ట్‌ఫోన్‌ను ఏడు నెలల్లోనే నిలిపివేయలేదు. వచ్చే కొన్ని రోజుల్లో ఎంఐ ఏ1కు సక్సెసర్‌గా ఎంఐ ఏ2 లాంచ్‌ చేయనున్న నేపథ్యంలో షియోమి ఈ ఫోన్‌ అమ్మకాలను నిలిపివేస్తున్నట్టు టెక్‌ విశ్లేషకులంటున్నారు. ఎంఐ 6ఎక్స్‌ , ఎంఐ ఏ2 చైనాలో ఈ నెల 25న లాంచ్‌ కాబోతోంది. అయితే కంపెనీ అధికారిక ఆహ్వానంలో మాత్రం ఎంఐ 6ఎక్స్‌ గురించి ధృవీకరించలేదు. కొంత మంది టెక్‌ విశ్లేషకులు ఏప్రిల్‌ 25న ఎంఐ 5ఎక్స్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేస్తుందని అంటున్నారు.

loader