Asianet News TeluguAsianet News Telugu

మాల్దీవుల్లో హైదరాబాద్ విద్యార్థుల అవస్థలు

  • ఘోరంగా మోసపోయిన విద్యార్థులు
  • తినడానికి తిండి కూడా లేని పరిస్థితి
hyderabad students facing problems in maldives

విదేశాల్లో చదువు.. ఆ వెంటనే ఉద్యోగం.. అందులోనూ వేలల్లో జీతం .. ఏవరు మాత్రం కాదనుకుంటారు ఇలాంటి అవకాశం.. పాపం వాళ్లు కూడా అలానే అనుకున్నారు. కానీ వారు ఊహించినది ఒకటి అయితే.. జరిగింది మరోకటి. ఉద్యోగం.. జీతం పక్కన పెడితే.. అసలు తినడానికి తిండి, తాగడానికి మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. స్వదేశానికి తిరిగి రాలేని పరిస్థితి. కన్న బిడ్డలను ఎప్పుడు చూస్తామా అని వారి తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు.ఇలాంటి దారుణ పరిస్థితి ఎదుర్కొంటున్నది మన హైదరాబాదీలే.
వివరాల్లోకి వెళితే... దిల్ సుఖ్ నగర్ లో ఆరేళ్ల క్రితం ఆర్యన్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ ను ప్రారంభించారు. దీనికి బరెడ్డి వెంకట నారాయణ రెడ్డి ప్రిన్సిపల్ గా, నందు, చైతన్యలు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. మూడేళ్ల హోటల్ మేనేజ్ మెంట్ కోర్సులో 250 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. ఒక్కో విద్యార్థి నుంచి రూ.60వేలు చొప్పున ఫీజు వసూలు చేస్తున్నారు. ఏడాది కోర్సు పూర్తి చేసేన 30మంది విద్యార్థులను మాల్దీవులకు జాబ్ వీసా పై పంపుతున్నట్లు చెప్పారు. ఇందు కోసం  ఒక్కోక్క విద్యార్థి నుంచి  రూ.4.25లక్షలు వసూలు చేశారు.

విదేశాలలో శిక్షణ ఉంటుందని.. ఆ తర్వాత ఉద్యోగం ఇచ్చి రూ.70 వేలు ఇస్తారని నమ్మబలికి వారిని అక్కడికి పంపించారు.. అక్కడికి వెళ్లిన తర్వాత తాము మోస పోయినట్లు విద్యార్థులు గుర్తించారు. వెంట తీసుకువెళ్లిన డబ్బు అయిపోయివడంతో బస చేసిన హోటల్ యాజమాన్యం వారికి నరకం చూపిస్తోంది.

ఈ విషయం ఇక్కడ ఉంటున్న తల్లిదండ్రులకు తెలిసింది. వారికి కళాశాల యాజమాన్యాన్ని ప్రశ్నించగా.. మాల్దీవుల్లో ఉన్న విద్యార్థులకు డబ్బు పంపిస్తామని చెప్పి నమ్మించారు. మరుసటి రోజు కళాశాలకు వెళ్లి చూస్తే.. కాలేజీ గేటుకు తాళం వేసి ఉంది. దీంతో వారి పరిస్థితి దిక్కుతోచకుండా మారింది. ఏమి చేయాలో పాలు పోని పరిస్థితి.. కన్న బిడ్డలను తిరిగి చూస్తామా లేదా అనే బాధతో వారు తల్లడిల్లిపోతున్నారు. బాధితులను శిక్షించి.. తమ బిడ్డలను తమ దగ్గరు చేర్చాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

కళాశాలలో చదువుతున్న మిగిలిన విద్యార్థులు.. ఆందోళనలు చేపడుతున్నారు. పరారీలో ఉన్న కళాశాల ప్రిన్సిపల్ నారాయణ రెడ్డి, డైరెక్టర్లు నందు, చైతన్యలను పట్టుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గతంలోనూ కళాశాల యాజమాన్యం విద్యార్థులను ఈ విధంగానే మెసం చేసింది. అయితే.. అప్పుడు తక్కువ మంది విద్యార్థులు వెల్లడంతో ఏవరికీ తెలియలేదు. ఈ సారి ఒకేసారి 30 మంది విద్యార్థులు వెల్లడంతో.. వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios