హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం, తల్లీ కూతుళ్ల మృతి

hyderabad road accident
Highlights

టీవిఎస్ వాహనాన్ని ఢీకొట్టిన డీసీఎం

హైదరాబాద్ లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం తల్లి కూతుళ్లను బలితీసుకుంది. ఓ ప్యామిలీ టీవిఎస్ వాహనంపై వెళుతుండగా డిసిఎం వ్యాను ఢీ కొట్టంది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారితో పాటు ఆమె తల్లి అక్కడికక్కడే మృతి చెందారు. తండ్రి మాత్రం స్వల్ప గాయాలతో బైటపడ్డాడు. 

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తకోటకు చెందిన ప్రకాష్‌, ప్రణీత భార్యాభర్తలు. వీరికి  ధన్‌రాజ్‌ , మానస ఇద్దరు సంతానం. ప్రకాష్ మల్కాజిగిరిలోని లాల్వాణినగర్‌లో ఉంటూ ఓ డిష్ టీవి కంపెనీలో ఉద్యోగం చేస్తూ భార్యా పిల్లల్ని పోషిస్తూ ఆనందంగా జీవిస్తున్నాడు. అయితే వీరి కుటుంబం మొత్తం కలిసి నిన్న బోడుప్పల్‌లోని బందువుల ఇంటికి పంక్షన్ కి వెళ్లారు. అనంతరం కొడుకును అక్కడే ఉంచి మిగతా ముగ్గురు బైక్ పై ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో మౌలాలికి చేరుకోగానే వీరు ప్రయాణిస్తున్న టీవీఎస్‌ వాహనాన్నిడీసిఎం వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రణీత, మానస అక్కడికక్కడే చనిపోగా ప్రకాష్ ప్రాణాలతో బైటపడ్డాడు.

ఈ సంఘటనపై సమాచారం అందుకున్న మల్కాజిగిరి పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

loader