Asianet News TeluguAsianet News Telugu

ఆ మోసగాడిని అరెస్టు చేశారు..!

  • ఒక్కోక్క విద్యార్థి నుంచి  రూ.4.25లక్షలు వసూలు చేశారు.
  • హోటల్ యాజమాన్యం వారికి నరకం చూపించింది.
Hyderabad police book principal for cheating 30 students

 

విదేశాలలో చదువు.. వెను వెంటనే ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి.. విద్యార్థులను మోసం చేసిన ఆర్యన్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ ప్రిన్సిపల్ వెంకట నారాయణ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.  ఇటీవల హైదరాబాద్ కి చెందిన దాదాపు 30మంది విద్యార్థులను మాల్దీవుల్లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి.. వారిని మోసం చేసిన సంగతి తెలిసిందే.

వివరాల్లోకి వెళితే... దిల్ సుఖ్ నగర్ లో ఆరేళ్ల క్రితం ఆర్యన్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ ను ప్రారంబమయ్యింది. దీనికి బరెడ్డి వెంకట నారాయణ రెడ్డి ప్రిన్సిపల్ , నందు, చైతన్యలు డైరెక్టర్లు. మూడేళ్ల హోటల్ మేనేజ్ మెంట్ కోర్సులో 250 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. ఒక్కో విద్యార్థి నుంచి రూ.60వేలు చొప్పున ఫీజు వసూలు చేశారు. ఏడాది కోర్సు పూర్తి చేసేన 30మంది విద్యార్థులను మాల్దీవులకు జాబ్ వీసా పై పంపుతున్నట్లు గతంలో చెప్పారు. ఇందు కోసం  ఒక్కోక్క విద్యార్థి నుంచి  రూ.4.25లక్షలు వసూలు చేశారు.

విదేశాలలో శిక్షణ ఉంటుందని.. ఆ తర్వాత ఉద్యోగం ఇచ్చి రూ.70 వేలు ఇస్తారని నమ్మబలికి వారిని అక్కడికి నారాయణ రెడ్డి తీసుకువెళ్లారు. వారిని ఓ హోటల్లో వదిలిపెట్టి.. నారాయణ రెడ్డి  ఇండియాకు వచ్చాడు. ప్రిన్సిపల్ మళ్లీ వస్తాడని.. విద్యార్థులు చాలా రోజులు ఎదురు చూశారు. ఎన్ని రోజులకు రాకపోవడంతో హోటల్ యాజమాన్యాన్ని సంప్రదించగా.. వారు తమకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. దీంతో తాము మోస పోయినట్లు విద్యార్థులు గుర్తించారు. వెంట తీసుకువెళ్లిన డబ్బు అయిపోయివడంతో బస చేసిన హోటల్ యాజమాన్యం వారికి నరకం చూపించింది. ఎలానో అలా తిప్పలు పడి తమ బాధను తల్లిదండ్రులకు తెలియజేయగా.. విషయం బయటకు వచ్చింది.

దీంతో కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు కొంత కాలం నుంచి ఆందోళన చేస్తున్నారు.  తమ పిల్లలను రక్షించాలని కోరుతూ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో పోలీసులు  నిందితుల కోసం విస్తృతంగా దర్యాప్తు చేపట్టారు.  ఇటీవల చైతన్యను అరెస్టు చేయగా.. ఈ రోజు వెంకట నారాయణ రెడ్డిని పట్టుకోగలిగారు. మరో  నిందితుడు నందు కోసం గాలిస్తున్నారు.

తమ డబ్బును తిరిగి తమకు అప్పగించాలంటూ తల్లిదండ్రులు కోరుతుండగా.. వారికి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios