హైదరాబాద్ పోలీసుల కస్టడీలో నకిలీ డీసిపి

First Published 30, Dec 2017, 1:03 PM IST
hyderabad police arrested pseudo police at kachiguda
Highlights
  • కాచిగూడాలో సూడో పోలీసు అరెస్ట్
  • అక్రమ వసూళ్లకు పాల్పడుతూ దొరికిపోయిన వైనం

అతడు పోలీస్ కాదు. వీఐపీ అంతకన్నా కాదు. కానీ ఖరీదైన బుగ్గకారులొ తిరుగుతాడు. తాను పోలీస్ ఉన్నతాధికారినని (డీసిపి, ఎసిపి స్థాయి) సామాన్యులను బురిడీ కొట్టిస్తాడు. ఇలాగే చెప్పుకుంటూ వ్యాపారులను, సామాన్య ప్రజలను మోసం చేసి డబ్బులు వసూలు చేస్తాడు. ఈ డబ్బులతో జల్సాలు చేసుకుని డబ్బులు అయిపోగానే మళ్లీ పోలీస్ అవతారం ఎత్తుతాడు. ఇలా పోలీస్ పేరు చెప్పుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని హైదరాబాద్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే కాచిగూడకు చెందిన రాఘవేంద్ర సత్యపాల్ జూవల్కర్ ఈజీగా డబ్బులు సంపాదించడాని ఓ పథకం వేశాడు. ప్రజల్లో పోలీసులు పట్ల ఉన్న భయాన్ని ఆసరాగా చేసుకుని పోలీస్ ఉన్నతాధికారి అవతారం ఎత్తాడు. ఇందుకోసం ఓ ఖరీదైన బుగ్గ కారును రెడీ చేసుకున్నాడు. అందులో డిసిపి డ్రెస్ వేసుకుని తిరుగుతూ అక్రమ వసూళ్లకు పాల్పడేవాడు. అతడ్ని నిజమైన పోలీస్ గా భావించి ప్రజలు భయంతో డబ్బులు ఇచ్చేవారు.  ఈ డబ్బుతో అతడు జల్సాలు చేసుకుని డబ్బులు అయిపోగానే మళ్లీ పోలీస్ గా మారేవాడు. ఇలా అటు ప్రజలను, ఇటు పోలీసులను మోసం చేసేవాడు.

అయితే ఈ సూడో పోలీస్ వ్యవహారంపై సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సత్యపాల్‌ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి ఒక బుగ్గ ఇండిగో కారు, రెండు ద్విచక్ర వాహనాలు, కంప్యూటర్, రెండు పోలీస్ ఐడీ కార్డులు, డీసీపీ యూనిఫాం, రెండు పోలీస్ లాటీలను స్వాధీనం చేసుకున్నారు. స్వాదీనం చేసుకున్న వస్తువులతో పాటు నిందితుడు సత్యపాల్ ని టాస్క్ ఫోర్స్ బృందం కాచిగూడ పోలీసులకు అప్పగించారు. 
 

loader