ఆరుగురి ప్రాణాలను కాపాడిన లేక్ పోలీసులు

First Published 16, Apr 2018, 11:29 AM IST
hyderabad Lake police save six lives
Highlights

ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు, ఓ ఇంటర్ విద్యార్థిని

హుస్సెన్ సాగర్ వద్ద గస్తీ నిర్వహించే లేక్ పోలీసులు ఆరుగురిని కాపాడారు. వివిధ కారణాలతో హుస్సెన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకోడానికి వచ్చిన బాధితులను పోలీసులు కాపాడారు. వారిని పోలీస్ స్టేషన్ కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు.

కుటుంబ కలహాలతో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి సాగర్ లో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే ఆమెను గమనించిన హైదరాబాద్ లేక్ పోలీసులు వారిని కాపాడారు. ఇక ఇదేవిధంగా మరో ఇద్దరు మహిళలు  కూడా కుటుంబ కలహాలు, భర్తల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించారు. అలాగే ఓ ఇంటర్మీడియట్ విద్యార్థి ఫెయిల్ అయ్యాడన్న మనస్థాపంతో సాగర్ లో దూకి బలవన్మరణానికి ప్రయత్నించాడు. పోలీసులు ఇతడ్ని కాపాడి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇలా ఒకేరోజు ఆరుగురి ప్రాణాలను కాపాడారు లేక్ పోలీసులు.

 


 
 

loader