ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు జాహ్నవి మాగంటి. ఈ హైదరాబాద్ అమ్మాయి.. వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. సాధారణంగా పెయింటింగ్ అనగానే చేతులతో వేస్తారు. కానీ.. ఈ తెలంగాణ అమ్మాయి మాత్రం కాళ్లతో అద్భుతమైన పెయింటింగ్ వేసింది. అది కూడా ప్రపంచంలోనే అతి పెద్ద పెయింటింగ్.

గతంలో బ్రిటన్ కి చెందిన ఓ స్టూడెంట్ 100 చదరపు మీటర్ల పొడవుగల పెయింటింగ్ వేసి రికార్డు క్రియేట్ చేస్తే.. ఆ రికార్డుని జాహ్నవి బ్రేక్ చేసింది. 140 చదరపు మీటర్ల పొడవుగల పెయింటింగ్ వేసి గిన్నీస్ రికార్డ్ కి ఎక్కింది. అంతేకాదు.. జాహ్నవి డ్యాన్స్ చేస్తూ కూడా కాలితో పేయింటింగ్ వేయగలదు.

కేవలం పెయింటర్కా మాత్రమే కాదు.. జాహ్నవిలో ఒక మంచి డ్యాన్సర్, ఆర్టిస్ట్, క్లాసికల్ మ్యూజికల్ సింగర్, బాస్కెట్ బాల్ ప్లేయర్ కూడా దాగి ఉన్నారు. మొత్తానికి ఈ హైదరాబాద్ అమ్మాయి అన్ని రంగాల్లో తన సత్తా చాటుతూ ఆల్ రౌండర్ అనిపించుకుంటోంది.