ఈ బురిడీ బాబా బంగారాన్ని మాత్రమే పూజిస్తాడు

First Published 23, Dec 2017, 6:54 PM IST
hyderabad fraud baba arrest
Highlights
  • టోలిచౌకి లో బురిడీ బాబాను అరెస్ట్ చేసిన పోలీసులు
  • అతడి నుండి కేజీ బంగారం, 3 లక్షలు స్వాదీనం

మంత్రాలతో జబ్బులను నయం చేస్తానని చెబుతూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్న ఓ దొంగబాబాను సికింద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్దనుంచి భారీగా నగదుతో పాటు, బంగారాన్ని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.

ఈ బురిడీబాబా వివరాలిలా ఉన్నాయి.   టోలీచౌకీ కి చెందిన ఇస్మాయిల్ చేతబడులకు నయం చేస్తానంటూ బాగా ప్రచారం చేసుకున్నాడు. ఇలా గత ఆరేళ్లుగా అతడు తన ఇంట్లోనే పూజలు చేస్తూ అమాయకులను నమ్మిస్తూ మోసం చేస్తున్నాడు. అతడి మాటలు నమ్మి వచ్చిన బాధితులకు కాకుండా వారి బంగారానికి పూజలు చేయడం ఇతగాడి స్పెషాలిటి. ఇలా పూజ పేరుతో బాధితుల వద్ద బంగారాన్ని తీసుకుని వారం రెండు వారాల తర్వాత రమ్మని చెబుతాడు. వారు తిరిగి వచ్చేలోపు నగలను మార్చడం గానీ, వారి బంగారంలోంచే కొట్టేయడం కానీ చేస్తాడు. ఇతడి మోసాన్ని పసిగట్టిన కొందరు బాధితులు టాస్క్ పోర్స్ పోలీసులకు సమాచారం అందించడంతో వారు రంగంలోకి దిగి బురిడీ బాబాను అరెస్ట్ చేశారు.  


 
నిందితుడి నుంచి 1.07 కిలోల ఆభరణాలు, రూ.3.05లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇలా కాజేసిన బంగారంతో తాకట్టు పెట్టి ఓ ఇంటిని కూడా నిర్మించుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీర్ఘ కాలిక రోగాలు నయం చేస్తానని చెప్పి బాధితులను బురిడీ కొట్టిస్తునన్నట్లు తాము గుర్తించామని తెలిపారు.
 

loader