ఈ కొత్త సాఫ్ట్ వేర్ పోలీసుల నిఘాలో ఉన్న వ్యక్తుల హైదరాబాద్ లో ఎక్కడ తిరుగుతున్నా వెదిక పట్టిస్తుంది

హైదరాబాద్ పోలీసులు నేరస్థుల కదలికలను పసిగట్టేందుకు హైదరాబాద్ పోలీసుల అంత్యంత అధునిక పరికాలను వాడబోతున్నారు. ప్రయోగాత్మకంగా వీటిని వాడి సత్పళితాలు సాధించారు. ఇక నుంచి హైదరాబాద్ లోకి అనుమానితులెవరై ప్రవేశించినా, నగరం నుంచి జారుకునేందుకు ప్రయత్నించినా పోలీసులకు తెలిపోతుంది. ఎవరైన నేరస్థుడు హైదరబాద్ లోకి ప్రవేశించిన మరుక్షణం పోలీసులను అప్రమత్తం చేస్తుంది. దీనితో ఇక అతగాడిని పోలీసులు నీడలా వెంటాడుతారు. రోడ్డు మీద తిరిగే వారినేకాదు, అండర్ బ్రిడ్జెజ్, ఫ్లైవోవర్ల మీద వాహనాలను కూడా ఇవి గాలిస్తూ ఉంటాయి.

ఇదెలా సాధ్యం? ఒక కొత్తరకం పాఫ్ట్ వేర్ ఈ పనంతా పూర్తి చేస్తుంది. దీనిని పేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ. ఈ మధ్య నే ఇది న్యూయార్క్ లో మొదలయింది. ఇపుడు హైదరాబాద్ కు వస్తాంది. సికింద్రాబాద్ లో ప్రయోగం విజయవంతమయింది.ఇప్పటికే 20 నేరస్థులనుఈ టెక్నాలజీ ఉపయోగించి పట్టుకున్నారు. అమెరికా లోని న్యూయార్క్ లో టనెల్స్, వంతెనల దగ్గిర కూడా ఈ కెెమెరాలను ఏర్పాటుచేశారు. ఇవి దాదాపు టెనెల్స్ , వంతెనల ద్వారా వెళ్లె లక్షల వాహనాలు ఇది శోధిస్తూ ఉంటాయి.

ఎలా పనిచేస్తుంది

తప్పించుకు తిరుగుతున్న నేరగాళ్లను, అనుమానితులు,పోలీసుల నిఘాలో ఉన్న పాత నేరస్థులను పట్టుకోడానికి సరికొత్త వ్యవస్థ పనికొస్తుంది. అంతే, పోలీసుల దగ్గిర ఫోటో ఉంటేచాలు, ఫోటోలో ఉన్న వ్యక్తి ఏ గుంపులో ఉనా, కారులో ఉన్నా, సందులు గొందులలో తిరుగుతున్నా ముఖాన్ని ఈ సాఫ్ట్ వేర్ గుర్తిస్తుంది. సాధారణంగా ఉన్న సిసిటివి కెమెరాల కేవలం చిత్రాలను చూపిస్తాయి. ఈ కొత్త సాఫ్ట్ వేర్ పోలీసుల నిఘాలో ఉన్న వ్యక్తులను వెదికి పెడతాయి. పోలీసుల ఒక ఫోటో డేటాబేస్‌లో ఉన్న ప్రతి ముఖం కోసం ఈ కెమెరాలు వెదుకుతూ ఉంటాయి.

ఈ డేటాబేస్ లో ఉన్న నేరగాడు , ఉదాహరణకు సికిందరబాద్ రైల్వేస్టేషన్ లో రైలు దిగగానేఅక్కడి ఈ కేమెరాలు అతగాడిని గుర్తుపట్టి పోలీసులను అప్రమత్తం చేస్తాయి. ఇది ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లోనే. 2 నెలల వ్యవధిలో 20 మంది నేరగాళ్లను ఈ వ్యవస్థ ఆధారంగా గుర్తించగలిగామని పోలీసులు చెబుతున్నారు. అక్కడ రైల్వేస్టేషన్‌లోకి అడుగుపెట్టే నాలుగు ప్రధాన దారుల్లో ఈ ఫేసియల్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేశారు అందుకే ఈ వ్యవస్థను నగరమంతా విస్తరింపచేసేందుకు చర్యలు మొదలు పెట్టారు.

తెలంగాణాలో ఏం జరగుతుంది...

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లతో పాటు దేశవ్యాప్తంగా వివిధ నేరాలతో సంబంధం ఉన్న దాదాపు 50 వేలమంది నేరగాళ్ల ఫొటోలతో డేటాబేస్ సిద్దమయింది. ఈ డేటాబేస్ ఆధారంగా ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్ వేర్ , దానితోముడివడి ఉన్న కెమెరాలు పనిచేస్తాయి. ఈ 50 వేల పోటోలలో ఉన్న వ్యక్తి ఈ కెమెరాల ఏర్పాటుచేసిన ప్రాంతానికి రాగానే నగర కమిషనర్ కార్యాలయంలో ఉన్న కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ అప్రమత్తం సమాచారం అందుతుంది.

ఈ 50 వేల ఫొటోలను ఈ సాఫ్ట్ వేర్ అర నిమిషంలో స్కాన్ చేస్తుందని దీనిని పర్యవేక్షిస్తున్న ఇన్‌స్పెక్టర్‌ శ్రీనాథ్‌ అంటున్నారు.

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లోని పోలీసులకు నగరంలోకి వచ్చిన నేరగాడి’ సమాచారంలో ఆ ప్రాంతంలోని పోలీసులు రంగంలోకి దిగుతారు. ఈ పద్ధతి దుర్గా ప్రసాద్ అనే నేరగాణ్ని పట్టుకున్నారు. ఇతగాడి మీద చాలా కేసులు నమోదయ్యాయి. తప్పించుకు తిరుగుతున్నాడు. అయితే, ఆ మధ్య సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు ఈ కొత్త వ్యవస్థ పోలీసు యంత్రంగాన్ని అప్రమత్తం చేసింది. అతడిని పట్టుకున్నారు.