Asianet News TeluguAsianet News Telugu

అందిరికీ ఉరిశిక్ష

  • దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో తీర్పు
  • ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష విధించిన ఎన్ ఐఏ న్యాయస్థానం
  • పరారీలో ప్రధాన నిందితుడు యాసిన్ భత్కల్
Hyderabad blast case five get death sentence by NIA court

 

దిల్‌సుఖ్‌నగర్‌లో  జంట పేలుళ్ల  కేసులో నిందితులకు క్ష ఖరారైంది. ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం వారికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు నిచ్చింది.

 

 

ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థ సభ్యులే ఈ దారుణానికి పాల్పడినట్లు న్యాయస్థానం ఈ నెల 13న నిర్ధారించిన విషయం తెలిసిందే.

 

 

ఈ ఉగ్రదాడికి పాల్పడిన అసదుల్లా అక్తర్‌ అలియాస్‌ హడ్డీ, జియా ఎర్‌ రెహమాన్‌ అలియాస్‌ వకాస్‌, తెహసీన్‌ అక్తర్‌ అలియాస్‌ మోనూ, యాసిన్‌ భత్కల్‌, ఐజాజ్‌ షేక్‌లకు

 ఉరిశిక్షను విధిస్తున్నట్టు ఎన్ ఐ ఏ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించింది.

 

ఎన్ఐఏ స్పెషల్, రంగారెడ్డి జిల్లా జడ్జి శ్రీనివాసరావు తీర్పు వెలువరించారు.

 

 

హత్య, హత్యాయత్నం, దేశద్రోహం, కుట్ర తదితర అభియోగాల కింద ఐపీసీ 120బీ, 121, 121ఏ, 122, 307, 316, 318, 436, 466, 474, 201 రెడ్‌విత్‌ 34, 109 సెక్షన్లతో పాటు పేలుడు పదార్థాల చట్టంలోని 35, ప్రజా ఆస్తుల ధ్వంసం చట్టంలోనిసెక్షన్‌ 4, చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టంలోని 16, 17, 18, 19 సెక్షన్ల కింద అభియోగాలు రుజువయ్యాయి.

 

 

పాక్ కు చెందిన వకాస్‌పై విదేశీయుల చట్టంలోని సెక్షన్‌ 14, 2 ఆఫ్‌ 3 కింద నేరం నిరూపణ అయింది.

 

 

చర్లపల్లి జైలులోని ఎన్‌ఐఏ న్యాయస్థానంలో తుది వాదనల అనంతరం నిందితులకు కోర్టు శిక్షలు ఖరారు చేసింది.

 

 

2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంట పేలుళ్లలో 19 మంది చనిపోయారు. 131 మంది గాయపడ్డారు.

 

 

ప్రధాన నిందితుడు రియాజ్‌ భత్కల్‌ పరారీలోనే ఉన్నాడు. అతడు పాక్ లో ఉన్నట్లు ఎన్‌ఐఏ పేర్కొంది. అతడిని పట్టుకునేందుకు ఇంటర్‌పోల్‌ నోటీసు కూడా జారీచేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios