2017 బెస్ట్ ఫుడ్స్ ఇవే..

First Published 29, Dec 2017, 12:12 PM IST
hyderabad biryani palced best food of 2017 in india
Highlights
  • నగర బిర్యానీ గుమగుమలను 2017వ సంవత్సరం దేశ వ్యాప్తంగా వ్యాపించేలా చేసింది.

2017వ సంవత్సరం నగరానికి కొత్త గుర్తింపును తీసుకువచ్చింది. వెళుతూ వెళుతూ.. బెస్ట్ ఫుడ్స్ అందించిన నగరంగా కీర్తిని తెచ్చిపెట్టింది.  ఇంతకీ ఏమిటా గుర్తింపు అంటారా..? హైదరాబాద్ బిర్యానీ. 2017లో టాప్ మోస్ట్ టేస్టీ ఫుడ్ గా బిర్యానీ నిలిచింది. నగర బిర్యానీ గుమగుమలను 2017వ సంవత్సరం దేశ వ్యాప్తంగా వ్యాపించేలా చేసింది.

వివరాల్లోకి వెళితే.. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ.. ఈ ఏడాది చేపట్టిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ సంవత్సరం భారతీయులు మెచ్చిన అన్ని రకాల ఫుడ్స్  కేవలం దక్షిణ భారతదేశానికి చెందినవి కావడం విశేషం. బెస్ట్ ఫుడ్ హైదరాబాద్ బిర్యానీ కొట్టేస్తే.. బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ గా మసాలా దోశ నిలిచింది. అంతేకాదు.. మన ఇడ్లీ సాంబారు కూడా టాప్ ప్లేస్ లోనే ఉంది. ప్రస్తుతం యువత ఎంతో ఆసక్తి చూపిస్తున్న పిజ్జా, బర్గర్ లను వెనక్కి నెట్టేసి మసాలా దోశ, ఇడ్లీ సాంబారు తమ ఖ్యాతిని చాటుకున్నాయి. మొన్నటికి మొన్న.. తెలంగాణ నగరంలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా  బిర్యానీని కొనియాడటం విశేషం.

తమిళనాడు అనగానే గుర్తుకు వచ్చే సాంబారు కూడా బెస్ట్ ఫుడ్స్ జాబితాలో చోటు కొట్టేసింది. సాంబారు రుచికి నార్త్ ఇండియన్స్ కూడా దాసోహం అయిపోతున్నారు. ఇక స్నాక్స్ విషయానికి వస్తే.. సమోసా టాప్ లో నిలిచింది. పావుబాజీ, వడాపావు, మంచూరియాలను వెనక్కి నెట్టేసి బెస్ట్ స్నాక్ ఐటెమ్ తానేనని నిరూపించుకుంది.

సమోసా మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ తన సత్తాచాటుకుంది. దక్షిణాఫ్రికాలో చిరుతిండ్ల తయారీ పోటీ పెట్టారు. ఆ  పోటీల్లో మన భారతీయ మహిళ సమోసా తయారు చేయగా.. దాని రుచికి అందరూ దాసోహం అయిపోయారు. కాకపోతే అది మన రెగ్యులర్ ఆలూ సమోసా కాదులేండి. చికెన్ మంచూరియా సమోసా. ఈ పోటీలో ఛాక్లెట్‌, జీడిపప్పు వంటకాలు, పిజ్జాల లాంటి వాటిని తయారు చేసినా.. సమోసా రుచికి అవి సరిపోలేదు. మొత్తానికి మన దక్షిణ భారతీయుల రుచులను ఈ ఏడాది ప్రపంచమంతా మెచ్చుకున్నారు.

loader