హైదరాబాద్ కు చెందిన విజయలక్ష్మి అనే ఒక బ్యూటీషియన్‌ అనుమానాస్పద పరిస్థితులలో మృతిచెందారు. భయటకు వెళ్లొస్తానని చెప్పి వెళ్లిన విజయలక్ష్మి ఫిలింనగర్‌లోని ఆర్‌జే ఫొటోగ్రఫీ కార్యాలయంలో ఆమె శవమై కనిపించారు.
హైదరాబాద్ కు చెందిన ఒక బ్యూటీషియన్ అనుమానాస్పద పరిస్థితులలో మృతిచెందింది. బంజారాహిల్స్ పోలీసులు సమాచారం మేరకు శ్రీకృష్ణానగర్లో నివసించే బ్యూటిషియర్ అ రుమిల్లి విజయలక్ష్మి అలియాజ్ శిరీష (28) సోమవారం రాత్రి 8–40 గంటలకు ఇంటినుంచి వెళ్లింది.తర్వాత తాను ఆలస్యంగా వస్తానని భర్త సతీష్చంద్రకు ఫోన్ చేసి చెప్పింది. అయితే రాత్రికి ఆమె ఇంటికి రాలేదు. ఎప్పటిలాగానే సతీష్ మంగళవారం ఉదయం తన ఉద్యోగానికి వెళ్లారు.
విజయలక్ష్మి ఫిలింనగర్లోని ఒక ఫోటో గ్రఫీ కార్యాలయంలో హెచ్ఆర్గా పనిచేస్తున్నది.
అయితే, సతీష్చంద్రకు బంజారాహిల్స్ పోలీసులు ఫోన్చేసి ఫిలింనగర్లోని ఆర్జే ఫొటోగ్రఫీ కార్యాలయానికి ఉన్నఫలనా రావాలని చెప్పారు. అక్కడికి వెళ్ళి చూడగా మంచంపైన భార్య శిరీష మృతదేహం కనిపించింది. ఈ సంస్థ యజమాని వల్లభనేని రాజీవ్. రాత్రి 2 గంటల ప్రాంతంలో ఫ్యాన్కు ఉరేసుకుందని తానే చున్నీని కత్తిరించి మంచం మీద పడుకోబెట్టానని యజమాని తెలిపారు. ఇందులో ఏదో మోసం ఉందని భర్త అనుమానిస్తున్నారు. భార్య ఆత్యహత్య చేసుకొనే పిరికిది కాదని ఆత్మహత్య వెనక అనాలున్నాయని సతీష్చంద్ర పోలీసులకు పిర్యాదుచేశారు. వీరికి కూతురు కూడా ఉంది.
