Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ వైపు పరుగుతీస్తున్న ఆంధ్రా ఎమ్సెట్ రాంకర్లు

ఆంధ్ర చాలా ముందుకు పోతున్నదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ ఏడాది కల్లా రాష్ట్రంలో లక్ష ఐటి ఉద్యోగాలని ఆయన కుమారుడు ఐటి మంత్రి లోకేశ్ ఎంత చెపుతున్నా విద్యార్థుల్లో గాని, తల్లితండ్రుల్లోగాని నమ్మకం కలగడం లేదు. 900 కి. మీ పోడవైన తీర రేఖ ఉన్న ఆంధ్రలో ఇంజనీరింగ్‌ చదివేందుకు విద్యార్థులు, వారి తల్లితండ్రులు  ఆసక్తి చూపడం లేదు. వాళ్ల కోర్సు అయ్యేనాటికి  ఆంధ్రలో ఉద్యోగాలు పుడతాయనే నమ్మకం కల్గడం లేదు.

Hyderabad Andhra engineering aspirants preferred destination
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఆంధ్ర చాలా ముందుకు పోతున్నదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ ఏడాది కల్లా రాష్ట్రంలో లక్ష ఐటి ఉద్యోగాలని ఆయన కుమారుడుఐటి మంత్రి లోకేశ్ ఎంత చెపుతున్న ఆంధ్ర విద్యార్థులలో గాని, తల్లితండ్రుల్లోగాని నమ్మకం కలగడం లేదు. 900 కి. మీ పోడవైన తీర రేఖ ఉన్న ఆంధ్రలో ఇంజనీరింగ్‌ చదివేందుకు విద్యార్థులు, వారి తల్లితండ్రులు  ఆసక్తి చూపడం లేదు.

 మరోవైపు తెలంగాణలో జరుగుతున్న ఎంసెట్‌కు ఆంధ్ర ప్రదేశ్  విద్యార్థుల ఎగబడుతున్నారు. ఒక వైపు టాప్‌ ర్యాంకర్లతా జాతీయ విద్యా సంస్థల వైపు చూస్తుంటే, మిగతా విద్యార్ధులు హైదరాబాద్‌లోని ఇంజనీరింగ్‌ కళాశాలల వైపు పరుగు తీస్తున్నారు.

కారణం:    లోకేశుడు చెబుతున్నట్లు  ఆంధ్రలో ఐటీ విప్లవం వస్తుందని లక్షల ఉద్యోగాలు తమ కోర్సు అయ్యే లోపు వస్తాయనే నమ్మకం వారిలో లేదు. కనుచూపు మేరలో అలాంటి ఆశ కనిపించడం లేదు. స్టాండర్డ్ పరంగా, ప్లేస్‌మెంట్స్‌  పరంగా హైదరాబాద్‌ బాగా ముందుండటం, ఎపి కాలేజీలు వెనుకబడి ఉండటం వల్ల మంచి ర్యాంకు సాధించిన విద్యార్థులంతా, హైదరాబాద్‌ చుట్టు పక్కల కళాశాలలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఒక విద్యార్థి తండ్రి ఏషియానెట్ కు తెలిపారు.

 

రాష్ట్రంలోని ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ను వదిలేసి వారు తెలంగాణలోని కౌన్సెలింగ్‌కు హాజరవుతున్నారు. ఈ ఏడాది నిర్వహించిన ఎపి ఎంసెట్‌లో 1,39,190 మందికి ర్యాంకులు కేటాయించారు. ఈనెల 8 నుంచి సర్టిఫికెట్లు పరిశీలన జరిగింది.  11 నుంచి వెబ్‌ ఆప్షన్లను ఇమ్మన్నారు. గురువారం నాటికి 1,15,000 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాల్సి ఉండగా, కేవలం 59,533 (51.76శాతం) మందే హాజరయ్యారు. మరోపక్క వెబ్‌ ఆప్షన్ల పరిస్థితి కూడా ఇలానే ఉంది. బుధవారం నాటికి 60 వేల మంది విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. గురు, శుక్రవారాల్లో 90వేల లోపు విద్యార్థులు ఆప్షన్లు నమోదు చేసుకోవాలి.

 

గురువారం నాటికి మొత్తం 38,685 మంది విద్యార్థులు మాత్రమే తమ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. 1000 లోపు ర్యాంకులు సాధించిన వారిలో కనీసం సగం మంది కూడా కౌన్సెలింగ్‌కు హాజరు కాలేదు. 1000 లోపు సాధించిన వారిలో 278 మాత్రమే హాజరయ్యారు. మొదటి 100 లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థుల్లో కేవలం ఇద్దరే కౌన్సెలింగ్‌కు హాజరవ్వగా, వారిలోనూ ఒక్కరే వెబ్‌ ఆప్షన్ ఇచ్చారు. 100 నుంచి 200 ర్యాంకులు సాధించిన విద్యార్థుల్లో 10 మంది మాత్రమే కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. 

 


తెలంగాణలో కౌన్సెలింగ్‌కు 12న (తొలిరోజు) 6 వేల ర్యాంకు వరకు ధ్రువపత్రాల పరిశీలన చేయగా ఎయు రీజన్‌ నుంచి 373 మంది, 13వ తేది (రెండో రోజు) 710 మంది 14వ తేది (మూడో రోజు) 964 మంది, 15వ తేది (నాల్గవ రోజు) 1145 మంది హాజరయ్యారు. శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్‌ మొదటి రోజు 143 మంది, రెండో రోజు 342 మంది, మూడో రోజు 470, నాల్గవ రోజు 586 మంది హాజరయ్యారు. ఈ నాలుగు రోజుల్లో ఎపి నుంచి 4,733 మంది హాజరయ్యారు. ఈ నెల 21వరకు పత్రాల పరిశీలన ఉండటంతో మరో 6 వేల నుంచి 8 వేల మంది విద్యార్థులు పరిశీలనకు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మే 12న జరిగిన తెలంగాణ ఎంసెట్‌ పరీక్షకు ఏపిలో ఇంజనీరింగ్‌ విభాగానికి 11,600 మంది పరీక్ష రాశారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో 4 నుంచి 5 వేల మంది విద్యార్ధులు హైదరాబాద్‌ కేంద్రంగా పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 95 ప్రకారం రెండు రాష్ట్రాల్లోని విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించేందుకు వీలుగా ఆర్టికల్‌ 371-డి ప్రకారం ప్రస్తుతం ఉన్న ప్రవేశాల కోటా పదేండ్లకు మించకుండా కొనసాగించాలని స్పష్టం చేస్తోంది. దీని ప్రకారం ఓపెన్‌ కోటాలో 15 శాతం ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాల పొందుందుకు వీలు ఉంటుంది. దీంతో మంచి ర్యాంకు వచ్చిన వారు కన్వీనర్‌ కోటా సీట్లకు పోటీ పడుతుండగా, ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉన్న వారు నేరుగా మేనేజ్‌మెంట్‌ సీట్ల కోసం ప్రయత్నిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios