భర్త.. భార్యని అడగకూడని ప్రశ్నలేవో తెలుసా?

భర్త.. భార్యని అడగకూడని ప్రశ్నలేవో తెలుసా?

పెళ్లి అనే బంధంతో ఒక్కటై జీవితాంతం ఒకరికోసం మరొకరు జీవించే వాళ్లే భార్యభర్తలు. ఎంత ప్రేమానురాగాలతో ఉండే భార్యభర్తల మధ్య అయినా.. చిన్న చిన్న మనస్పర్థలు రావడం సహజం. ఒక్కోసారి ఆ చిన్న చిన్న మనస్పర్థలే పెద్ద పెద్ద వివాదాలకు దారితీసి.. బంధం తెంపుకునే దాకా దారితీస్తాయి.  అలాంటివి జరగకుండా ఉండాలంటే భర్తలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ముఖ్యంగా ఈ ప్రశ్నలు మాత్రం మీ భార్యను ఎట్టి పరిస్థితుల్లో అడగకూడదు. ఆ ప్రశ్నలు అడిగితే మీ భార్యకి చాలా కోపం వచ్చే అవకాశం ఉంది. ఆ ప్రశ్నలేంటో ఇప్పుడు చూద్దామా...

1.ఇంత ఎక్కవ మేకప్ అవసరమా..?

ఎట్టిపరిస్థితుల్లోనూ మీ భార్యను ఈ ప్రశ్న అడగకూడదు. ఎందుకంటే.. 80శాతం గొడవలు భార్యభర్తల మధ్య ఈ విషయంలోనే జరుగుతున్నాయని ఓ సర్వేలో వెల్లడయ్యింది. భార్యభర్తలు ఇద్దరూ బయటకు వెళదామని ప్లాన్ చేసుకుంటారు. బయటకు వెళ్లేందుకు రెడీ అవ్వడానికి అమ్మాయిలు ఎక్కువ సమయం కేటాయిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే.. ఎంత సేపు రెడీ అవుతావు. ఇప్పుడు మేకప్ అవసరమా అని అడిగితే వారు బాధపడతారట. మీ భార్య అందంగా ఉంటే మీకే మేలు అన్న విషయం తెలుసుకోని వారిని తీరిగ్గా రెడీ అయ్యే వరకు ఓపికగా వ్యవహరించండి.

షాపింగ్ కి ఎంత సమయం కేటాయిస్తావు?

 ఈ ప్రశ్న గొడవలకు దారితీస్తుందని అనేక అధ్యయనాలు చెప్పాయి! ఇలాంటి ప్రశ్నలు ఆనందాన్ని పాడుచేస్తాయి. షాపింగ్ సమయంలో ఆమె ఆనందం చచ్చిపోతుంది! డబ్బులు మీవైనా ఆమెవైనా, తగాదా పడకుండా ఆమె షాపింగ్ అయ్యేవరకు మాట్లాడకుండా ఉండడం తెలివైన పని.

నా ఫోను ఎందుకు చెక్ చేస్తున్నావు?

ఇది మీ భార్యే కాదు, ఇతరులు కూడా చేయోచ్చు. మీ స్నేహితులను అడగండి! మీ భార్య మీ ఫోను నుండి బ్రౌస్ చేయడానికి ఇష్టపడుతుంది, అది ఆమె జన్మహక్కు. ఆమెను ఇదొక ప్రశ్నలు అడిగేకంటే, మీరు ప్రశాంతంగా ఉండాలి అంటే అసభ్యకర చిత్రాలను, అన్ని చాట్ లను తొలగించండి. అంతేకాకుండా, మోసం చేయడం మానేయండి

గర్భవతిగా ఉన్నపుడు శృంగారంలో పాల్గొందామా?

ఈ ప్రశ్న వేస్తే మీకు ఆమెపై శారీరిక వ్యామోహం ఉంది అనుకుంటుంది. మిమ్మల్ని చెంపదెబ్బ కొట్టొచ్చు లేదా బాధపెట్టొచ్చు. దీనికి బదులుగా గర్భధారణ సమయంలో ఆమెకి ఆమె స్వతహాగా అడిగేదాకా మీ కోరికను నియంత్రించుకోవడం మంచిది

ప్రతి వారం మీ పుట్టింటికి ఎందుకు వెళతావు?

 మీరు వారి కుటుంబ సభ్యులను ఇష్టపడకపోయినా, ఇలాంటి ప్రశ్నల నుండి దూరంగా ఉండండి. ఆమె మిమ్మల్ని అసహ్యించుకోవడం ప్రారంభిస్తుంది! ఇలాంటి ప్రశ్నలు భార్యాభర్తల మధ్య దూరాన్ని తగ్గిస్తాయి.

షేవ్ చేసుకున్నావా?

అవాంచిత జుట్టు గురించి మాట్లాడడం చాలా సున్నితమైన విషయం. అది కాళ్ళ మీద లేదా ముఖం మీద అయినా, దాని గురించి ఎప్పుడూ మాట్లాడొద్దు, అది అనాగరికంగా చాలా ఇబ్బంది పెట్టేదిగా ఉంటుంది. ఆమె జుట్టు గురించి మీకు అనవసరం.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page