అశ్లీల చిత్రాలకు బానిసై ఈ నీచుడు భార్యని ఏమి చేశాడో తెలుసా

First Published 4, Apr 2018, 1:31 PM IST
Husband kills wife on womens day
Highlights
అశ్లీల చిత్రాలకు బానిసై ఈ నీచుడు భార్యని ఏమిచేసాడంటే

ఒకవైపు సామాజిక మాధ్యమాల్లో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంతో మంది మహిళల గొప్పతనం గురించి పొగుడుతున్నారు.సమానత్వం రావాలని కోరుకుంటున్నారు. కానీ రియాలటీ అందుకు పూర్తి భిన్నంగా గోరంగా ఉండటం ఆందోళన కలిగించే అంశం. మహిళా దినోత్సవం రోజు హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఈ సంఘటణ ఎంతోమందిని విపరీతంగా కలిచివేసింది. ఉమర్ పాషా అనే వ్యక్తి హైదరాబాద్ లో క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇతనికి రేష్మా సుల్తానా అనే అమ్మాయితో పెళ్లి అయ్యింది. ఉమర్ పాషా కు అళ్లీల చిత్రాలు విపరీతంగా చూసే అలవాటు ఉంది. అతడు అశ్లీల చిత్రాలు చూడటానికి వ్యసనపరుడుగా మారిపోయాడు.

 అలా చూడొద్దని అతని బార్య ఎన్నోసార్లు ఉమర్ పాషా కు చెప్పింది అలాగే వేడుకుంది. కానీ అసలు అతనిలో ఎటువంటి మార్పు లేదు. భార్య చెప్పే మాటలను అసలు పట్టించుకోలేదు. మహిళ దినోత్సవం రోజు ఇదే విషయమై ఎంత చెప్పినా వినకుండా అశ్లీల చిత్రాలను చూస్తూనే ఉండటంతో భార్య ఇంట్లో ఉన్న వైఫై రూటర్ ను ఆఫ్ చేసింది. దీంతో కోపంతో ఊగిపోయిన పాషా కట్టె తీసుకుని బార్య రేష్మా సుల్తానాను విపరీతంగా కొట్టాడు. ఆమె ఛాతిపై పిడిగుద్దులు కురిపించాడు. సున్నితమైన ప్రదేశాలలో కూడా విపరీతంగా కొట్టాడు. దీంతో ఆమె కల్లు తిరిగి పడిపోయింది. అయినా కూడా ఉమర్ పాషా శాంతించలేదు. భార్యను పుట్టింట్లో వదిలేయడానికి కారులో తీసుకెళ్లి ఆమె ఇంటి వద్ద కారు ఆపకుండానే కారులో నుండి సుల్తానాను కిందకు తోసి అక్కడ నుండి వెళ్లిపోయాడు. 

మరో ఘోరమైన విషయం ఏమిటంటే ఎనిమిది నెలల క్రితం ఈ దంపతులకు ఒక ఆడపిల్ల జన్మించింది. కానీ ఎవరికి చెప్పకుండా ఆ పాపను ఎవరికో అమ్మేశాడు. కూతురు సుల్తానా తీవ్ర గాయాలపాలవటంతో తల్లి షబానా పోలీసులకు పిర్యాదు చేశారు. మధ్యపానం ధూమపానం మత్తు పదార్థాలు ఎలాగైతే మనుషులను వ్యసనపరులుగా మారుస్తాయో. అలాగే అశ్లీల చిత్రాలు చూడటనేది కూడా ఒక వ్యశనంలా తయారయ్యింది ఈ ఆధునిక కాలంలో. అలా చేయకండి అవి చూడకండి అంటే కొంతమంది తట్టుకోలేకపోతున్నారు. కోపంతో ఇష్టం వచ్చినట్టు తాము ఏం చేస్తన్నామో ఆలోచన కూడా లేకుండా విచక్షనారహితంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మనుషులను వ్యశనంలా మార్చే ఇలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిదని చెబుతున్నారు.

loader