40మెగాపిక్సెల్ కెమేరాతో హువావే స్మార్ట్ ఫోన్

Huawei launches new 68-megapixel triple camera smartphone it claims is 'much better' than iPhone X
Highlights

ఈ ఫోన్ ముందు డిజిటల్ కెమేరా కూడా పనికి రాదు

ఈ మధ్యకాలంలో విడుదలైన అన్ని స్మార్ట్ ఫోన్లూ.. ఫీచర్ల విషయంలో ఒకదానితో మరొకటి విపరీతంగా పోటీపడుతున్నాయి. ప్రాసెసర్, కెమేరా విషయంలో అయితే.. ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కాగా.. చైనాకి చెందిన ప్రముఖ ఎలెక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ హువావే.. ఈ విషయంలో మరో అడుగు ముందుకేసింది. 40మెగా పిక్సెల్ కెమేరా గల స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది.

పారిస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో హువావే పీ20, పీ20 ప్రో స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. ఐఫోన్‌ ఎక్స్, శామ్‌సంగ్‌ ఎస్‌9 ఫోన్లకు పోటీగా హువావే ఈ మోడళ్లను తీసుకొచ్చింది. ఇందులో పీ20 ప్రో మోడల్‌కు వెనుకవైపు మూడు కెమెరాలున్నాయి. వీటిలో ఒకటి 40 మెగాపిక్సెల్‌ కెమెరా. ఇక ఈ రెండు మోడళ్లకు 360 డిగ్రీల ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌ ఉంది. 0.6 సెకన్లలోపే ఈ స్మార్టఫోన్లు ఫేస్‌ రికగ్నిషన్‌ ద్వారా అన్‌లాక్‌ అవుతాయని సంస్థ తెలిపింది. పీ20 మోడల్‌ ధర 649 యూరోలు(భారత కరెన్సీలో దాదాపు రూ. 52,000), పీ20 ప్రో ధర 899యూరోలు(దాదాపు రూ. 72,000)గా నిర్ణయించింది. త్వరలోనే ఈ ఫోన్లు భారత మార్కెట్లోకి అడుగుపెట్టనున్నాయి.

 

loader