బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ఓ స్టార్టప్ కంపెనీతో రూ.100కోట్ల ఒప్పందం కుదర్చుకున్నాడు. క్యూర్ ఫిట్ అనే స్టార్టప్ కంపెనీ  కి ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు. ఐదు సంవత్సరాల పాటు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు ఆయన రూ.100కోట్లు ఇవ్వాల్సిందిగా కంపెనీ నిర్వాహకులను కోరగా.. అందుకు వారు కూడా అంగీకరించారు.

అంతేకాకుండా కంపెనీ ఈక్విటీ స్టాక్స్ లోనూ హృతిక్ కి కంపెనీ భాగస్వామ్యం కల్పించింది. ఇది హెల్త్ అండ్  వెల్ నెట్ స్టార్టప్. ఈ స్టార్టప్ కంపెనీ కోసం హృతిక్ ప్రచారం  చేయనున్నారు. ఈ స్టార్టప్.. క్యూర్ ఫిట్ పేరిట  ఫిట్ నెస్ సెంటర్లను నిర్వహించనుంది. వీటితో ప్రతి సంవత్సరం రూ.250కోట్ల వ్యాపారం జరుగుతుందని కంపెనీ నిర్వాహికులు భావిస్తున్నారు.

త్వరలోనే వీటికి సంబంధించి మొబైల్ యాప్ ని కూడా విడుదల చేయనున్నట్లు వారు చెప్పారు. ఈ ఫిట్ నెస్ సెంటర్లలో హెచ్ ఆఇర్ ఎక్స్ పేరుతో వర్క్ అవుట్స్ చేయిస్తారు. ఇవి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని వారు చెప్పారు. వీటికి వస్తున్న స్పందన తమకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందని కంపెనీ నిర్వాహకులు  తెలిపారు.

బాలీవుడ్ తారలు స్టార్టప్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండటం కొత్తేమీ కాదు. షారూక్ ఖాన్.. బిగ్ బాస్కెట్ కి  ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. ఆమిర్ ఖాన్ గత ఏడాది వరకు స్నాప్ డీల్ కి అంబాసిడర్ గా వ్యవహరించారు.  అలియాభట్ కూడా ఇటీవల  బ్లూస్టోన్ ఆన్ లైన్ జ్యూయలరీ కంపెనీకి అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.