జియో ఇకపై  ప్రైమ్ మెంబర్ షిప్ ను కూడా ఫ్రీ గా అందించేందుకు సిద్ధమైంది.

ఏప్రిల్ నుంచి జియోను వదిలేద్దామనుకునే జియో కస్టమర్లకు శుభవార్త. మరో బంపర్ ఆఫర్ తో రిలయన్స్ మనముందుకు వస్తోంది.

ఇప్పటి వరకు వాయిస్ కాల్స్ ఫ్రీ గా ఇచ్చిన జియో ఇకపై ప్రైమ్ మెంబర్ షిప్ ను కూడా ఫ్రీ గా అందించేందుకు సిద్ధమైంది. కాకపోతే దీనికి కొన్ని నిబంధనలు పెట్టింది.

వినియోగదారుడు జియో మనీ వాలెట్ లేదా మై జియో యాప్ ద్వారా లాగిన్ అయి రూ.99 తో పాటు రూ. 303 చెల్లించాలి. అప్పుడు యాప్‌ లోరూ.50 డిస్కౌంట్ వోచర్‌ వస్తుంది.

ఈ వోచర్‌ ను తరువాత రీచార్జ్‌ లో కూడా వినియోగించుకోవచ్చు. 25 మార్చి నుంచి జూన్‌ 30 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంది.

ఈ పరిమిత కాలంలో ఇలా యూజర్‌ 5 సార్లు ట్రాన్సాక్షన్‌ చేసుకోవాలి.

ఇలా రెండుసార్లు రీచార్జ్‌ చేసుకొని, రెండు సార్లు 50 క్యాష్ బ్యాక్‌ పొంది ప్రైమ్‌ మెంబర్‌ షిప్‌ను ఉచితంగా పొందవచ్చు.