Asianet News TeluguAsianet News Telugu

వాట్సాప్ లో డిలీట్ చేసినా.. మెసేజ్ చూడొచ్చా

  • అంతకముందు ఒక్కసారి వాట్సాప్ లో మెసేజ్ పంపితే.. దానిని తిరిగి వెనక్కి తీసుకునే అవకాశం ఉండేది కాదు. ఈ డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్ వచ్చాక ఎవరికైనా పొరపాటున మెసేజ్ పంపితే.. మెసేజ్ పంపిన 7 నిమిషాల లోపు దానిని డిలీట్ చేయవచ్చు.
How to Read a Deleted WhatsApp Message

ప్రముఖ మొబైల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి తెలియని వారు ఉండరు. ప్రతి ఒక్కరూ ఈ వాట్సాప్ ని ఉపయోగిస్తున్నవారే.  ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ.. వాట్సాప్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇటీవల ‘డిలీట్ ఫర్ ఎవ్రీవన్’ అనే ఫీచర్ ని కూడా తీసుకువచ్చింది.  అంతకముందు ఒక్కసారి వాట్సాప్ లో మెసేజ్ పంపితే.. దానిని తిరిగి వెనక్కి తీసుకునే అవకాశం ఉండేది కాదు.

How to Read a Deleted WhatsApp Message

ఈ డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్ వచ్చాక ఎవరికైనా పొరపాటున మెసేజ్ పంపితే.. మెసేజ్ పంపిన 7 నిమిషాల లోపు దానిని డిలీట్ చేయవచ్చు. డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఆప్షన్ ఎంచుకుంటే.. పంపినవాళ్లకి.. మెసేజ్ రిసీవ్ చేసుకున్న వాళ్లకి ఎవ్వరికీ కనపడదు. ఆ మెసేజ్ పూర్తిగా డిలీట్ అయిపోతుంది. ఈ ఫీచర్ వచ్చాక..దాదాపు చాలా మందే ఈ ఫీచర్ ని వినియోగించుకున్నారు. అయితే.. ఒక్కడే ఒక ట్విస్ట్ ఉంది. డిలీట్ చేశాక కూడా ఆ డిలీటెడ్ మెసేజ్ ని చూడొచ్చు అంటున్నారు నిపుణులు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

How to Read a Deleted WhatsApp Message

మీకెవరైనా మెసేజ్ పంపి.. దానిని వెంటనే డిలీట్ చేశారనుకుందాం. దానిని సింపుల్ గా మళ్లీ చూడొచ్చు.. ఈ కింది స్టెప్స్ ఫాలో అయితే..  సరిపోతుంది.

1. గూగుల్ ప్లే నుంచి ‘‘నోటిఫికేషన్ హిస్టరీ’’ అనే యాప్ ని డౌన్ లోడ్ చేసుకోవాలి.

2. డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత ఆ యాప్ ని ఓపెన్ చేస్తే.. అది మీ ఫోన్ లో ‘నోటిఫికేషన్ హిస్టరీ’ ని ఎనేబుల్ చేసుకోమని అడుగుతుంది.

3. దానిని యాక్సెస్ చేసుకన్న తర్వాత హోమ్ స్క్రీన్ కి వెళ్లి.. లాంగ్ ప్రెస్ చేయాలి. తర్వాత widgets సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత యాక్టివిటీస్ ఓపెన్ అవుతాయి. వాటిలో  సెట్టింగ్స్  ఎంచుకోవాలి. దానిలో నోటిఫికేషన్ లాగ్ ని సెలక్ట్ చేసుకోవాలి. అంతే మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో నోటిఫికేషన్ లాగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీ వాట్సాప్ కి వచ్చే అన్ని మెసేజ్ లను దీని ద్వారా చూడవచ్చు.

కాకపోతే దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఉదాహరణకు మీకు ఇప్పుడు వాట్సాప్ లో ఒక మెసేజ్ వచ్చిందనుకుందాం. వెంటనే మీ ఫోన్ కి నోటిఫికేషన్ వస్తుంది కదా. దానిని మీరు చూసారనుకుందాం లేదా రిప్లే ఇచ్చారు. అప్పుడు ఆ మెసేజ్ ఈ నోటిఫికేషన్ హిస్టరీలో ఉండిపోతోంది. తర్వాత దానిని డిలీట్ చేసినా కూడా. అలా కాకుండా మెసేజ్ నోటిఫికేషన్ రాగానే స్వైప్ చేశారనుకోండి  అప్పుడు కూడా హిస్టరీలో ఉంటుంది కాకపోతే.. ఫోన్ ని  కనుక రీస్టార్ట్  చేస్తే ఆ మెసేజ్ మీకు కనపడదు. అంతేకాదు. మెసేజ్ లో మొదటి 100 క్యారెక్టర్లన్నీ మాత్రమే సేవ్ చేయగలుగుతుంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ 7.0 ఆపరేటింగ్ సిస్టమ్, దాని అప్ డేటేడ్ ఆపరేటింగ్ సిస్టమ్ లలో మాత్రమే పనిచేస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios