బరువు తగ్గడానికి మూడు సులువైన మార్గాలు..

First Published 5, Dec 2017, 1:24 PM IST
How to Lose Weight Fast 3 Simple Steps
Highlights
  • మూడు సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే.. బరువు సులభంగా తగ్గవచ్చు అంటున్నారు నిపుణులు

బరువు తగ్గి.. స్లిమ్ గా అందంగా కనిపించాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. కానీ.. బరువు పెరిగినంత సులువుగా బరువు తగ్గలేము. ప్రస్తుతం మార్కెట్ లో బరువు తగ్గించేందుకు  ప్రత్యామ్నాయాలు చాలానే పుట్టుకువచ్చాయి. అయితే.. మూడు సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే.. బరువు సులభంగా తగ్గవచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ముందుగా బరువు తగ్గాలంటే.. మనం తీసుకునే ఆహారం తగ్గించాలి అలా అని కడుపు మాడ్చుకోకూడదు. కాబట్టి ముందుగా ఆకలిని తగ్గించుకోవాలి. అప్పుడు సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా మీ మెటబాలిక్ హెల్త్ కూడా మెరుగుపడుతుంది.

స్టెప్ 1.. నో షుగర్, కార్బొ హైడ్రేట్స్

బరువు తగ్గాలి అనుకునే వాళ్లు చేయాల్సిన ముఖ్యమైన పని ఏమిటంటే.. షుగర్, కార్బో హైడ్రేట్స్ ఎక్కువగా ఉంటే ఆహారాన్ని దూరంగా ఉంచాలి. ఎందుకంటే వీటిలో ఇన్సులిన్ ఎక్కువగా ఉంటుంది. ఇన్సులిన్ తక్కువగా ఉంటే.. శరీరంలోని కొవ్వు పదార్థాలు చాలా త్వరగా కరిగిపోతాయి. షుగర్, కార్బో హైడ్రేట్స్ తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే.. మొదటి వారంలో 10 పౌండ్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

స్టెప్ 2.. ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఆహారం

బరువు తగ్గడం అంటే ఏమి తినకుండా కడుపు మాడ్చుకోవడం కాదు. మంచి ప్రోటీన్స్ గల ఆహారాన్ని తీసుకోవాలి. కార్బొ హైడ్రేట్స్ తక్కువగా ఉండే కూరగాయలను ఆహారంగా తీసుకోవాలి. మీ ఆహారంలో వీటిని కచ్చితంగా తీసుకుంటే సులభంగా బరువు తగ్గవచ్చు.

ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే చికెన్, ఫిష్, సీ ఫుడ్, ఎగ్స్ లాంటివి తీసుకోవాలి. ఇవి మెటబాలిజయం హెల్త్ మెరుగుపడేలా చేస్తాయి. అంతేకాకుండా కార్బో హైడ్రేట్స్ తక్కువగా ఉండే బ్రకోలి, క్యాలీ ఫ్లవర్, క్యాబేజీ, దోసకాయ, పాలకూర, మష్రూమ్స్, మొలకలు వంటివి తీసుకోవాలి. ఒక రోజులో 20నుంచి 50 గ్రాములకు మించకుండా కార్బొ హైడ్రేట్స్ ఉన్న ఆహారం కూడా తీసుకోవచ్చు.

 అదేవిధంగా బరువు తగ్గాలనుకునే వారు కూడా గుడ్ ఫ్యాట్స్ తీసుకోవాలన్న విషయం మర్చిపోవద్దు. ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, అవకాడో ఆయిల్, వెన్న లాంటివి కొద్ది మొత్తంలో తీసుకోవాలి. తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు ఆహారాన్ని తీసుకోవడం  అలవాటు చేసుకోవాలి. వంట ఎక్కువ శాతం కోకోనట్ ఆయిల్ తో చేసుకోవడం మంచిది. భోజనం చేయడానికి ముందు మంచినీరు తాగడం అలవాటు చేసుకోవాలి.

స్టెప్ 3 వ్యాయామం..

బరువు తగ్గాలనుకునేవాళ్లు చేసే మరో ప్రయత్నం వ్యాయామం. వెయిట్ లాస్ అవ్వాలని అనుకున్న నాటి నుంచి వ్యాయామం చేయడం ప్రారంభించేస్తారు. అయితే.. మరీ అంత కష్టపడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. కేవలం వారంలో మూడు లేదా నాలుగు రోజులు జిమ్ కి వెళ్లి బరువులు ఎత్తితే సరిపోతుంది అంటున్నారు. బరువులు ఎత్తడం వల్ల శరీరంలోని కొవ్వులు కరిగి బరువు తగ్గుతారు. నిపుణుల పర్యవేక్షణలో చేయడం తప్పనిసరి. కచ్చితంగా బరువులే మోయాలని లేదు. కావాలంటే వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్ లాంటివి కూడా చేయవచ్చు.

ఈ మూడు సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే.. చాలా సులభంగా, త్వరగా బరువు తగ్గవచ్చు.

loader