Asianet News TeluguAsianet News Telugu

ఇంటి నుంచే.. ఆధార్, మొబైల్ ఫోన్ అనుసంధానం

  • మొబైల్ ఫోన్ తో ఆధార్ నెంబర్ ని అనుసంధానం చేసుకోవడం ఇప్పుడు సులభతరమైంది.
  • మీరు ఉన్న చోటునుంచే మొబైల్ నెంబర్ తో ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చు .
How to link Aadhaar to your mobile numberat your home

మొబైల్ ఫోన్ తో ఆధార్ నెంబర్ ని అనుసంధానం చేసుకోవడం ఇప్పుడు సులభతరమైంది. అంతకముందు.. మీ మొబైల్ ఫోన్ కి సంబంధించిన మొబైల్ రీస్టోర్ సెంటర్ కి వెళ్లి.. వాళ్ల దగ్గర చేయించుకునేవాళ్లు. అందుకు వాళ్లకు డబ్బులు కూడా చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు అంత కష్టపడకుండా.. మీరు ఉన్న చోటునుంచే మొబైల్ నెంబర్ తో ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చు . ఐవీఆర్ ఎస్ పద్దతిలో దీనిని పూర్తి చేయవచ్చు. ఈ విషయాన్ని డిజిటల్ ఇండియా తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

ఇందు కోసం మీరు మీ ఆధార్‌ నంబర్‌ను, మొబైల్‌ను కలిగి ఉంటే చాలు. ఎయిర్‌టెల్‌, ఐడియా, జియో, వొడాఫోన్‌ ఇలా ఏ నెట్‌వర్క్‌ కస్టమర్‌ అయినా సరే మీ ఫోన్‌ నుంచి 14546 నంబర్‌ను డయల్‌ చేయాల్సి ఉంటుంది.

 

1. ముందుగా 14546  నంబర్‌కు డయల్‌ చేయగానే మీరు ఇండియాకు చెందిన వారా లేదా ఎన్నారై కస్టమరా అడుగుతుంది. అందులో ఒక ఆప్షన్ ని ఎంపిక చేసుకోవాలి.

2.ఆ తర్వాత 1ని ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ ఆధార్‌ నంబర్‌ను పొందుపరిచిన తర్వాత మళ్లీ 1ని నొక్కాలి.

3. ఆ తర్వాత మీ మొబైల్‌ నంబర్‌కు ఓ వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ) వస్తుంది.

4. ఆ తర్వాత మీ మొబైల్‌ నంబర్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ మొబైల్‌ నంబర్‌లోని చివరి నాలుగు అంకెలను ఇవ్వాలి.

5. మొబైల్‌ నంబర్‌ ధ్రువీకరణ అనంతరం మీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత 1ని నొక్కడం ద్వారా మీ ఆధార్‌ నంబర్‌ రీ వెరిఫికేషన్‌ను పూర్తిచేయొచ్చు.

6. ఒకవేళ మీరు ఇది వరకే ఆధార్‌ అనుసంధానం చేసి ఉంటే ముందుగానే ఆ విషయాన్ని మీకు తెలియజేస్తారు. మీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీ అరగంటపాటు చెల్లుబాటు అవుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios