Asianet News TeluguAsianet News Telugu

హోలీ ఆడుతున్నారా... ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే

  • ప్రతి సంవత్సరం.. ఈ హోలీ కారణంగా మృత్యవాత పడుతున్న వారు కూడా ఉన్నారు. చాలా మంది కళ్లు కూడా పోగొట్టుకుంటున్నారు.అలా అని హోలీ జరుపుకోకుండా ఉండలేము. మరి ఏం చేయాలి..? కొన్ని జాగ్రత్తలు ఫాలో అయితే చాలు.. ఎలాంటి హానీ లేకుండా రంగుల పండగను ఎంజాయ్ చేయవచ్చు.
How to get rid of Holi stains from your skin and hair

దేశమంతా ఆనందంగా జరుపుకునే పండగల్లో హోలీ కూడా ఒకటి. ఒకరికి మరొకరు రంగులు పూసుకుంటూ.. జరుపుకునే రంగుల పండగ ఇది. ఈ పండగ జరుపుకోవడంలో ఆనందం సంగతి పక్కన పెడితే.. కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. రంగుల్లో ఉండే కెమికల్స్ కారణంగా.. చర్మ సమస్యలు, జుట్టు రాలే సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.  అంతేకాదు.. ప్రతి సంవత్సరం.. ఈ హోలీ కారణంగా మృత్యవాత పడుతున్న వారు కూడా ఉన్నారు. చాలా మంది కళ్లు కూడా పోగొట్టుకుంటున్నారు.అలా అని హోలీ జరుపుకోకుండా ఉండలేము. మరి ఏం చేయాలి..? కొన్ని జాగ్రత్తలు ఫాలో అయితే చాలు.. ఎలాంటి హానీ లేకుండా రంగుల పండగను ఎంజాయ్ చేయవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం...

జాగ్రత్తలు..

1. హోలీ అనగానే.. చాలా మంది పొట్టిపొట్టి బట్టలు, స్లీవ్ లెస్ డ్రస్సులు వేసుకుంటారు. అలాకాకుండా.. పూర్తిగా శరీరం అంతా కప్పి ఉంచేలాంటి డ్రస్సులు ఎంచుకోండి. అందులోనూ పాత బట్టలు అయితే  నయం. పాడైనా బాధపడాల్సిన అవసరం ఉండదు.

2. రంగులు పూసుకోవడానికి ముందు అమ్మాయిలు తలకి కొబ్బరి నూనె రాసుకొని.. జడ అల్లుకోవాలి.

3.ఇక చర్మానికి బేబీ ఆయిల్ రాసుకోవాలి

4. రంగులు కళ్లలోకి పడకుండా.. సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి.

5. పెదాలు పాడవ్వకుండా ముందుగానే.. లిప్ స్టిక్, లిప్ బామ్ లాంటివి రాసుకోవాలి.

6. రుంగులు చేతికి అంటినప్పుడు.. గోళ్లు పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి.. నెయిల్ పాలిష్ వేసుకోవాలి.

7.డ్రై కలర్స్ తో హోలీ ఆడటం బెటర్.

హోలీ తర్వాత.. ఇలా క్లీన్ చేసుకోవాలి.

1. ముందుగా తలకి, బాడీకి ఆయిల్ రాసుకొని ఉన్నారు కాబట్టి.. రంగులు పోయేదాక షవర్ కింద నిల్చోవాలి.వేడి నీటితో స్నానం చేయకూడదు. చల్లని లేదా.. గోరువెచ్చని నీటితో మాత్రమే చేయాలి.

2. వాటర్ తో కడిగిన తర్వాత కూడా రంగు పోకపోతే.. సబ్బు వాడకండి. ఆయిల్ తో.. రంగులు అంటిన చోట రుద్దండి. తర్వాత వాష్ చేయాలి.

3. శెనగపిండి, పెరుగు రెండూ కలిపి పేస్టులాగా చేసుకొని ముఖానికి, శరీరానికి రుద్దాలి.

4.అలా కాదు అంటే.. నిమ్మ చెక్కతో రుద్ది ఒక పది నిమిషాల తర్వాత నీటితో కడిగినా రంగులు సులభంగా వదులుతాయి.

Follow Us:
Download App:
  • android
  • ios