ఒక్క మిస్డ్ కాల్ తో.. పీఎఫ్ వివరాలు తెలుసుకోవచ్చు

First Published 16, Mar 2018, 11:57 AM IST
How To Check Your EPF Balance By Missed Call
Highlights
  • పీఎఫ్ వివరాలు తెలుసుకునేందుకు సులవైన మార్గం

మన దేశంలో పనిచేసే ఉద్యోగులందరూ తమ జీతంలో కొత్త మొత్తాన్ని పీఎఫ్ పేరిట చెల్లిస్తూ ఉంటారు. ఇది మన అందరికీ తెలిసిన విషయమే.కొన్ని ప్రైవేటు సంస్థలు.. ఉద్యోగుల డబ్బుతో పాటు.. సంస్థ కూడా కొంత మొత్తాన్ని పీఎఫ్ లో జమ చేస్తూ ఉంటుంది. ఇది కూడా తెలిసిన విషయమే. అయితే.. చాలా మందికి ఇప్పటి వరకు పీఎఫ్ ద్వారా ఎంత డబ్బు పొదుపు చేశాం? ఆ డబ్బు ఎలా తీసుకోవాలి లాంటి విషయాల గురించి పూర్తిగా అవగాహన ఉండదు. ఇలాంటి వారి కోసమే.. ప్రభుత్వం ఒక సదుపాయాన్ని తీసుకువచ్చింది. కేవలం ఒక ఫోన్ నెంబర్ కి మిస్డ్ కాల్ లేదా, ఎస్ఎంఎస్ చేయడం ద్వారా మీ పీఎఫ్ వివరాలు తెలుసుకోవచ్చు.

పీఎఫ్ ఖాతాలు ఉన్న సభ్యులు 7738299899 నెంబర్ ‘‘ఈపీఎఫ్ఓహెచ్ఓ యూఏఎన్’’ అని ఎస్ఎంఎస్ చేస్తే చాలు. మీ పీఎఫ్ పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ వివరాలను ప్రాంతీ య భాషల్లో కూడా పొందవచ్చు. తమిళం, ఆంగ్లం, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, కన్నడ, తెలుగు, బెంగాలీ భాషల్లో కూడా ఈ సౌకర్యాన్ని కల్పించారు. ఈ సేవలను స్మార్ట్‌ ఫోన్‌లోనే కాకుండా సాధారణ మొబైల్‌ ద్వారా కూడా పొందవచ్చన్నారు. వెబ్‌సైట్‌లో ఈపీఎఫ్‌ఓహెచ్‌ఓ యూఏఎన్‌ నెంబరు, మొబైల్‌ నెంబరు, ఆధార్‌ నెంబరులను నమోదు చేసి 011-22901406 టెలిఫోన్‌ నెంబరుకు మిస్‌కాల్‌ ఇచ్చి వివరాలు పొందవచ్చు. వీటితో పాటు యూఎంఏఎన్‌జీ ఏపీపీ అనే యాప్‌ ద్వారా కూడా పీఎఫ్‌ వివరాలను పొందవచ్చు.

loader