సరిలేరు ‘ప్రేమలత’కు ఎవ్వరు

How Homemaker Premlata Agrawal Became the Oldest Indian Woman to Scale Mount Everest
Highlights

  • మౌంట్ ఎవరెస్టు అధిరోహించిన భారతీయ మహిళ ప్రేమలత
  • ఎవరెస్టుతోపాటు 7 పర్వాతాలను అదిరోహించిన ప్రేమలత
  • అన్ని పర్వాతలను అధిరోహించిన తొలి భారతీయ మహిళ ప్రేమలత

 ‘‘కృషి ఉంటే మనుషులు రుషులౌతారు.. మహా పురుషులౌతారు’’ అన్నాడో సినీ కవి. ఇందుకు నిలువెత్తు నిదర్శనం 54ఏళ్ల ప్రేమలత.  ఇంతకీ ఆవిడ ఏమి సాధించింది అనే కదా.. మీ ప్రశ్న.. ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించింది. కేవలం ఎవరెస్టు మాత్రమే కాదు.. మొత్తం 7 శిఖరాలను ఆమె అధిరోహించారు.  ఈ వయసులో  7పర్వతాలను     అధిరోహించిన తొలి భారతీయ మహిళ ప్రేమలతే కావడం విశేషం.  ప్రేమలత అగర్వాల్.. 2011లో ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించారు. ఆ సమయంలో ఆమె ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొన్నారు.

చిన్న ఐస్ ముక్కను కాసేపు చేతితో పట్టుకోవడాన్నే మనం చలా కష్టంగా ఫీలవుతాం అవునా.. అలాంటిది వణుకుపుట్టించే చలిలో.. ఎవరెస్టు పర్వతాన్ని ఎక్కుతుండగా.. చేతి గ్లవుజు వూడి పడిపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ప్రేమలత విషయంలోనూ అదే జరిగింది. అలాంటి పరిస్థితుల్లో పర్వతాన్ని ఎక్కడం మంచిది కాదు.. వెనక్కి తిరిగి వెళ్లిపోమ్మన్ని ఆమెను తోటి పర్వతారోహణలు సూచించారట. కానీ.. అందుకు ఒప్పుకోలేదు. ఆత్మ సైర్థ్యంతో ముందుకు సాగి.. తన లక్ష్యాన్ని చేధించింది. అందుకుగాను కేంద్ర ప్రభుత్వం ఆమెను సత్కరించింది కూడా. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా 2013లో పద్మశ్రీ అవార్డను కూడా అందుకున్నారు. అంతేకాదు ఇటీవలే నేషనల్ అడ్వెంచర్ అవార్డును కూడా అందుకున్నారు.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం  డార్జిలింగ్ జిల్లాలోని  సుకియా పోకహరి అనే గ్రామం ప్రేమలత స్వస్థలం. ఆమె తల్లిదండ్రులు రామవతార్ అగర్వాల్, శ్రద్ధాదేవి. వీరిది పెద్ద కుటుంబం. ప్రేమలత చిన్న పిల్లగా ఉన్నప్పుడు వీరింట్లో దాదాపు 30మంది కుటుంబసభ్యులు ఉండేవారట. ప్రేమలత తల్లిదండ్రులకు 9మంది సంతానం. చిన్నప్పటి నుంచి ఆటల్లో చాలా చురుకుగా ఉండేదట. ఏ పోటీలు పెట్టినా కచ్చితంగా పాల్గొని విజయం సాధించేదట. 18వ ఏట.. ప్రేమలతకు వివాహం జరిగింది. తర్వాత ఆమెకు ఇద్దరు కూతుళ్లు పుట్టారు. దీంతో హోమ్ మేకర్ గా స్థిరపడిపోయింది.

ఒక రోజు తన ఇద్దరు కూతుళ్లకు టెన్నిస్ నేర్పించడానికి జంషడ్ పూర్ లోని జేఆర్డీ టాటా స్పోర్ట్స్ కి వచ్చారు ప్రేమలత. అక్కడ ఓ ప్రకటన ఆమెను ఆకర్షించింది. జంషడ్ పూర్ పరిసర ప్రాంతంలోని దల్మా అనే కొండ టెక్కింగ్ గురించి ఆ ప్రకటన. ఆ ప్రకటన చూసిన తర్వాత తనకు కూడా ట్రెక్కింగ్ చేయాలనే కోరిక కలిగింది. దీంతో వెంటనే.. ఆ ట్రెక్కింగ్ లో మొదటి సారి పాల్గొంది. అందులో 500మంది పాల్లొనగా మూడోస్థానంలో నిలిచారు ప్రేమలత. అనతంరం ఆ ట్రెక్కింగ్ కి సంబంధించిన సర్టిఫికెట్ తెచ్చుకునేందుకు టాటా స్పోర్ట్స్ కార్యాలయానికి  వెళ్లగా.. అక్కడ మరో విషయం ఆమెను ఆకర్షించింది. అదే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. లెజండరీ మౌంటైనర్ బచేంద్రి పాల్ ఫోటోలు ఆమె చూశారు. ఆమె లాగా తన కుమార్తెలను కూడా తయారు చేయాలనుకుంది. కానీ.. వారికి బదులు నువ్వెందుకు చేయకూడదు అని బచేంద్రి పాల్ ప్రశ్నించగా.. ఆమె ఆలోచనలో పడ్డారు. అంతే..తాను ఎలాగైనా పర్వతారోహణ చేయాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నారు. అప్పుడు ఆమె వయసు 35 సంవత్సరాలు.

బచేంద్రి పాల్ గైడెన్స్ లో తొలిసారి ప్రేమలత 2008లో సౌత్ ఆప్రికాలోని కిలిమంజారో పర్వతాన్న అధిరోహించారు. ఇలా మొదలైన ఆమె ప్రయాణం.. మొత్తంగా ఏడు పర్వాతాలను అధిరోహించారు.కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూనే.. కుటుంబ సభ్యులకు ఎలాంటి రాకుండా చూసుకుంటూనే ఆమె తన లక్ష్యాన్ని చేరుకున్న ప్రేమలత ఎందరికో ఆదర్శం.

loader