రాను రాను బతుకు ఛిద్రమవుతూ ఉంది.  దేనికీ భరోసా లేదు. ఆసుప్రతి లేదు, చదువు లేదు, చేసేందుకు పనీపాట లేదు,  చేసిన పనికి గిట్టుబాటు రాదు...ఈ బతకు  జిఎస్ టి ఎలా బాగు పడ్తుందో బోధపడటం లేదు.ఒక కవి అవేదన.

బతుకు ఛిద్రం

బతుకునిచ్చే బడిలేదు

భరోసనిచ్చే దావఖాన లేదు

బువ్వపెట్టే పనీపాట లేదు

80% గా వున్న ప్రజలను

ఈ మూడింటికి దూరం చేసి

ఎన్ని నోట్లు రద్దు చేస్తే ఏందీ ,

ఎన్ని GST లు తెస్తే ఏందీ

ఇవి ఎవడికి లాభం ?

ఎవడికి నష్టం ?

పండించిన పంటకు ధర ఉండదు

సదివిన సదువుకు కొలువుండదు

ఖాయిలాకు మందుండదు 

చేసేందుకు పనీ దొరకదు

ఈ నాలుగు లేనిదే అభివృద్ధి ఉండదు,

ఏమంటావ్ మిత్రమా?