తేనెటీగల దాడి.. పరుగులు తీసిన మంత్రి ఆది

తేనెటీగల దాడి.. పరుగులు తీసిన మంత్రి ఆది

మైలవరం జలాశయం గేట్లు ఎత్తడానికి వెళ్లిన మంత్రి ఆదినారాయణకు చేదు అనుభవం ఎదురైంది. జలాశయం గేట్లు ఎత్తగానే అక్కడ ఉన్న కందిరీగలు ఒక్కసారిగా లేచి దాడికి పాల్పడ్డాయి. దీంతో మంత్రి ఆదినారాయణ రెడ్డి అక్కడి నుంచి పరుగులు తీశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే..డప జిల్లా మైలవరం జలాశయం నుంచి పెన్నానదికి శుక్రవారం గే ట్లు ఎత్తి నీటిని వదులుతున్నారని తెలియడం తో పలువురు నాయకులు, అధికారులు మైలవ రం జలాశయం వద్దకు చేరుకున్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎంపీ సీఎం రమేష్‌, మం డలి విప్‌ రామసుబ్బారెడ్డి, పౌరసరఫరాల శాఖ సంస్థ చైర్మన్‌ లింగారెడ్డి, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి శుక్రవారం 11 గంటల సమయంలో గేట్లు ఎత్తారు. దీంతో గేట్లకు ఉన్న తేనేటీగలు ఒక్కసారిగా ప్రజలపై దాడి చేశాయి. దీంతో అక్కడకు చేరుకున్న నాయకులు, అధికారులు పరుగులు తీశారు. ఉత్తర కా లువ వైపు కొందరు, దక్షిణ కాలువ వైపు కొందరు పరుగెత్తారు.
ఈ తేనెటీగల దాడిలో మైలవరం మండల తహసీల్దారు షేక్‌ మొహిద్దీన్‌ కి గాయాలయ్యాయి.దీంతో ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page