బిజెపి కిషన్ రెడ్డిపై తేనెటీగల దాడి

బిజెపి కిషన్ రెడ్డిపై తేనెటీగల దాడి

హైదరాబాద్ లోని అంబర్ పేట బిజెపి ఎమ్బెల్యే జి. కిషన్ రెడ్డి  కి తృటిలో ప్రమాదం తప్పింది. ప్రజా సమస్యలు తెలుసుకోడానికి బాగ్ అంబర్ పేటలో పర్యటిస్తుండగా  కిషన్ రెడ్డి పై తేనెటీగల గుంపు దాడి చేసింది. ఆయనతో పాటు పర్యటనలో వున్న జీహెచ్ఎంసీ అధికారులు,పార్టీ నాయకులు, కార్యకర్తలపై కూడా తేసెటీగలు దాడి చేశారు. అయితే ఈ దాడితో అప్రమత్తమైన ఎమ్మెల్యే భద్రతా సిబ్బంది ఆయన్ని అక్కడినుండి సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అంబర్ పేట లోని వైభవ్ నగర్ లో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఎమ్మెల్యే కిషన్ రెడ్డి వెళ్లారు. అక్కడ ఆయన కార్యకర్తలు, అధికారులతో కలిసి టూల్ రూం ను పరిశీలించేందుకు వెళ్ళారు. అదే క్రమంలో అక్కడే ఓ చెట్టుపైన వున్న తేనెతుట్ట కదలడంతో తేనెటీగలు లేచి ఎమ్మెల్యేతో పాటు అక్కడున్నవారిని కుట్టాయి. దీంతో ఎమ్మెల్యే భద్రతా సిబ్బంది కిషన్ రెడ్డి టూల్ రూంలోకి తీసుకెళ్లి తలుపులు, కిటికీలు మూసి కాపాడారు. అప్పటికే ఆయనకు నాలుగైదు తేనెటీగలు స్వల్పంగా గాయపరిచాయి. ఇక ఆయనతో పాటు వున్న జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ 16 ఈఈ నిత్యానందం, బీజేపీ అంబర్‌పేట నియోజకవర్గం కన్వీనర్‌ ఎడెల్లి అజయ్‌కుమార్‌లు తేనెటీగల దాడిలో తీవ్రంగా గాయపడ్డారు.   
 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos