రూ. 2 వేల నోటు రద్దు అవుతోందంటూ రూమర్లు వస్తుండటంతో దీనిపై ఎట్టకేలకు కేంద్రం స్పందించింది.కొత్తగా ప్రవేశ పెట్టిన 2 వేల నోట్లను రద్దు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిరణ్ రిజుజు ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ ఈ రోజు లోక్ సభలో ప్రకటన కూడా చేశారు. 

 

బ్లాక్ మనీని వెలికితీయడంలో భాగంగా కేంద్రం వ్యూహాత్మకంగా రూ. 2 వేల నోట్లను తీసుకొచ్చిందని త్వరలోనే వీటిని రద్దు చేస్తారని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ రూమర్లపై ప్రతిపక్షాలు స్పందిచాలని కోరడంతో కేంద్రం ఈ మేరకు రూ. 2 వేల నోట్ల పై వివరణ ఇచ్చింది.

 

కొత్తగా వచ్చిన పెద్ద రూ.2వేల నోట్లను రద్దు చేయమని రిజుజు తెలిపారు. ఈ కొత్త నోట్లను ఎవరూ కాపీ చేయలేరని అత్యంత నాణ్యతప్రమాణాలతో వీటిని తీసుకొచ్చామని తెలిపారు.