ఈ రోజు మధ్యాహ్నం అన్నాసలై(మౌంట్‌) రోడ్డు లో ట్రాఫిక్ అధికంగా ఉన్న సమయంలోరోడ్డు కుంగిపోయి భారీ గొయ్యి ఏర్పడింది.

చెన్నైలో బెర్ముడా ట్రయాంగిల్ ఉండటం ఏంటీ అని కంగారు పడకండి. బెర్ముడా ట్రయాంగిల్ లో నౌకలు మునుగుతాయో లేదో తెలియదు కానీ, చెన్నైలోని ఈ మౌంట్ రోడ్డు పైకి వెళితే కచ్చితంగా మునిగిపోతాయి. నికార్సైన రోడ్డుపై కుంగిపోతాయి. కావాలంటే ఈ వీడియో చూడండి.

ఈ రోజు మధ్యాహ్నం అన్నాసలై(మౌంట్‌) రోడ్డు లో ట్రాఫిక్ అధికంగా ఉన్న సమయంలోరోడ్డు కుంగిపోయి భారీ గొయ్యి ఏర్పడింది. దీంతో ఆ రోడ్డు మీద ఉన్న బస్సు, కారు భారీ గొయ్యిలో కూరుకపోయాయి.

వాహనదారులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడ ట్రాఫిక్ ను నిలిపివేసి సహాయ చర్యలు చేపట్టారు. అండర్‌ గ్రౌండ్‌ మెట్రో రైలు పనుల కారణంగానే రోడ్డు కుంగిపోయి ఉండొచ్చని పోలీసులు తెలిపారు.