బడ్జెట్ ధరలో నోకియా న్యూ స్మార్ట్ ఫోన్

బడ్జెట్ ధరలో నోకియా న్యూ స్మార్ట్ ఫోన్

నూతన సంవత్సరంలో నోకియా మరో కొత్త స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. గతేడాది నోకియా నుంచి నోకియా6 ఫోన్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. దాని విజయానికి కొనసాగింపుగా నోకియా6(2018) పేరిట ఈ ఫోన్ ని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ఫోన్ ని చైనాలో అందుబాటులో ఉంచగా.. త్వరలోనే భారత్ లోనూ విక్రయానికి రానుంది. 32జీబీ నోకియా 6(2018) వేరియంట్‌ ధర సుమారు రూ.14,600 ఉండగా.. 64జీబీ వేరియంట్‌ ధర రూ.16,600గా ఉండబోతున్నట్టు తెలిసింది. ఈ రెండు వేరియంట్లు బ్లాక్‌, సిల్వర్‌ రంగుల్లో అందుబాటులోకి వచ్చాయి. ఒరిజినల్‌ నోకియా 6 మోడల్‌ మాదిరిగా కాకుండా..  ఈ ఫోన్‌కు వెనుకవైపు ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌ ఉంది. ఈ కొత్త నోకియా 6 మెటల్‌ యూనిబాడీతో 6000 సిరీస్‌ అల్యూమినియంతో రూపొందింది.

ఫోన్ ఫీచర్లు..

5.50 ఇంచెస్ డిస్ ప్లే

2.2జీహెచ్ జెడ్ ఆక్టాకోర్ ప్రాసెసర్

8మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమేరా

16మెగా పిక్సెల్ వెనుక కెమేరా

4జీబీ ర్యామ్

ఆండ్రాయిడ్ 7.1.1 ఆపరేటింగ్ సిస్టమ్

32జీబీ స్టోరేజీ

3000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page