అప్పుడు పదిగ్రాముల బంగారం రూ.18లే

First Published 5, Jan 2018, 3:54 PM IST
history of gold price for the last 90 years
Highlights
  • ఒక వారం కాస్త తగ్గినట్టు అనిపించినా.. మళ్లీ వెంటనే పెరిగిపోతోంది.

బంగారం ధర రోజురోజుకీ పెరిగిపోతోంది. ఒక వారం కాస్త తగ్గినట్టు అనిపించినా.. మళ్లీ వెంటనే పెరిగిపోతోంది. పసిడికి మన దేశంలో ఉన్న డిమాండ్ కారణంగానే అది రోజురోజుకీ పెరిగిపోతోంది. ముఖ్యంగా పెళ్ళిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు.. మధ్యతరగతి కుటుంబీకులు అటువైపు చూడాలంటేనే జంకేలా ఉంటుంది పసిడి ధర. ప్రస్తుతం పది గ్రాముల పసిడి ధర రూ.28వేల దాకా ఉంది. కానీ.. 1926లో తులం(పది గ్రాముల) బంగారం ధర ఎంతోతెలుసా..? కేవలం రూ.18.43 మాత్రమే. 1958వ సంవత్సరం వరకు పది గ్రాముల బంగారం ధర రూ.100లోపే ఉండేది. 1979 వరకు బంగారం ధర రూ.1000లోపే ఉండేది. ఆ తర్వాత ప్రజల బంగారం వినియోగం పెరిగేసరికి..దాని ధర కూడా పెరుగుతూ వచ్చింది. అంతెందుకు 2007వ సంవత్సరంలో పసిడి ధర రూ.10,800 ఉండేది. అదే బంగారం ధర రూ.2010లో రూ.18,500 చేరింది. ఆ తర్వాతే బంగారం ధర మరీ పెరిగిపోయింది. 2011లో పది గ్రాముల పసిడి ధర రూ. 26,400కు చేరుకుంది. కేవలం ఒక్క సంవత్సరంలోనే దాదాపు 8వేలు పెరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెయ్యి, రెండు వేలు తేడాతో పెరుగుతూ తగ్గుతూ వస్తోంది. గడిచిన 90 ఏళ్లలో బంగారం ధరలో వచ్చిన తేడాను కింద ఫోటోలో చూడవచ్చు.

 

loader