జగన్ పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

First Published 10, Jan 2018, 5:06 PM IST
hindupuram MLA balakrishna sensational comments on jagan
Highlights
  • జగన్ పాదయాత్రపై కామెంట్ చేసిన బాలకృష్ణ

వైసీపీ అధినేత జగన్ పై హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చేయడానికి ఏ పని లేకనే జగన్ పాదయాత్ర చేస్తున్నాడంటూ విమర్శించారు. వివరాల్లోకి వెళితే.. బుధవారం బాలకృష్ణ తన సొంత నియోజకవర్గమైన హిందూపురంలో పర్యటించారు.

ఈ సందర్భంగా హిందూపురంలోని కొటిపి రోడ్డులో పీఎంఆర్వై పథకం ఇళ్ల నిర్మాణానికి బాలకృష్ణ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీ పై విమర్శల వర్షం కురిపించారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత హిందూపురం నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేశానన్నారు. తమ ప్రభుత్వం చేస్తున్న    అభివృద్ధి  చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారన్నారు. అందుకే.. ఏం చేయాలో తెలియక రోడ్ల మీద తిరుగుతున్నారని దుయ్యబట్టారు.                                                                                                                                        

loader