జాగ్రత్త... 2 వేల నోటులో అణుబాంబులున్నాయి

hilarious rumors on two thousand rupees notes
Highlights

ఇప్పుడైనా ఆర్బీఐ ఇలాంటి  రూమర్ల కు  వెంటనే చెక్ పెట్టాలి.  లేకపోతే రూ. 2 వేల నోటులో అణుబాంబులున్నాయి. దాని తో న్యూక్లియర్ రియాక్టర్ ను కూడా పనిచేయించవచ్చు. అంతరిక్షంలోకి రాకెట్లను కూడా ప్రయోగించ వచ్చని  కూడా ప్రచారం చేస్తారు.

పిచ్చి పీక్స్ కు వెళ్లిపోతే  ఏదేదో చెప్పేస్తుంటారు.. రూ. 2 వేల నోటు పై  వస్తున్న వార్తలు కూడా ఇలానే తగలడుతున్నాయి.


రూ. 2 వేల నోటు వచ్చిన తర్వాత దానికి జరిగినన్ని శల్యపరీక్షలు బహుశా ప్రపంచంలో ఏ నోటుకు జరిగి ఉండవు.

 

రూ. 2 వేల నోటు బయటికి వచ్చాక వాటి రంగు, రూపం తదితర విషయాలపై జనాల్లో విపరీతమైన ఊహాగానాలు వెల్లువెత్తాయి.

 

రూ.2 వేల నోట్లలో జీపీఎస్ తో పనిచేసే నానో చిప్‌లు పెట్టారని చెప్పారు.

 

మొబైల్ ఫోన్‌ను రూ. 2 వేల నోటుపై పెడితే ప్రధాని సందేశం కనిపిస్తుందని పేర్కొన్నారు.

 

ఇప్పుడు రూ. 2 వేల నోటుపై మరో ప్రచారం మొదలెట్టారు.

 

రూ.2 వేల నోటులో పీ32 అనే రేడియో ధార్మిక ఫాస్పరస్ ఐసోటోప్ ఉందని సోషల్ మీడియాలో విసృతంగా ప్రచారం అవుతుంది.

 

ముద్రణలోనే రూ. 2 వేల నోటులో ఈ రేడియో ధార్మిక పదార్థాన్నే పెట్టారని అందుకే పెద్ద మొత్తంలో దాచిపెట్టిన కొత్త నోట్లు దొరికిపోతున్నాయని నిర్ధారించేశారు.

 

ఇటీవల ఐటీ అధికారులు సరిగ్గా ఎక్కడ నోట్ల కట్టలు దాచారో అక్కడే సోదాలు నిర్వహించి కరెన్సీ కట్టలను స్వాధీనం చేసుకోవడానికి ఈ రేడియో ధార్మిక పదార్థం కారణమని ఊదరగొడుతున్నారు.

 

 

ఇప్పడైనా ఆర్బీఐ ఇలాంటి రూమర్ల పై వెంటనే స్పందించాలి. లేకపోతే రూ. 2 వేల నోటుతో న్యూక్లియర్ రియాక్టర్ ను కూడా పనిచేయించవచ్చు. అంతరిక్షంలోకి రాకెట్లను కూడా ప్రయోగించ వచ్చని  కూడా ప్రచారం చేస్తారు.

 

loader