Asianet News TeluguAsianet News Telugu

చచ్చి, బతికినట్లే బతికి, మళ్లీ చచ్చి, మళ్లీ...

నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించాక ప్రజలను మచ్చిక చేసుకునేందుకు కేంద్రం 20 సార్లు కుప్పిగంతులేసింది. అందులో చిత్రమైన దూకుడు వేయి నోటుదే

hilarious revival of 1000 rupee  note

ఇదొక వెర్రి వేయి కథ

 

ప్రధాని నరేంద్రమోడీ అయిదొందల వేయి రుపాయల పాత నోట్లను నిషేధించి  15 రోజులయింది.  ఈ దెబ్బకు కుదేలయిన  నోట్ల వ్యవస్థ, బజారున పడిన చిల్లర జీవితాలు, ప్రజల ఆగ్రహం ... ఈ ప్రకంపనలను తట్టుకునేందుకు  గత రెండువారాలలో కేంద్ర ప్రభుత్వం వేసిన కుప్పిగంతులెన్నో.

 

ఇంతవరకు దాదాపు  20 మార్పలుచేర్పులు జరిగాయి. ఇందులో కొన్ని నిర్ణయాలు రద్దు చేయడం, సవరించడం, ప్రజలకు వెసలుబాటు కల్పించడం కోస చేసిన  తాత్కాలిక ప్రకటనలు,  కొన్ని కొత్త ప్రతిపాదనలు, పుట్టక ముందే చచ్చిన ప్రతిపాదనలు... ఇాలా ఎన్నో ఉన్నాయి.

 

 కేంద్రం అనాలోచిత నిర్ణయాలకు అన్నింటి కంటే తీవ్రంగా గురయింది అమాయకపు వేయినోటు. దీని సంగతి చూడండి.

 

నవంబర్ ఎనిమిదో తేదీ రాత్రి ఉన్న ఫలాన ప్రధాని మోదీ పాత వేయినోటును ఛీత్కరించుకుని, నల్ల రంగు పులిమి రద్దు చేస్తున్నానని చెప్పి నలిపి అవతలికి విసిరేశారు.పాత అయిదొందల, వేయి నోట్లు  ఈ అర్థరాత్రి నుంచి రద్దువుతున్నాయి. కాకపోతే, ప్రభుత్వం వీటి స్థానంలో కొత్త అయిదొందల నోటు, రెండువేల నోటు ఛలామణి లోకి  తెస్తుందని మాత్రం చెప్పారు. ఈ ప్రకటనలో కొత్ వేయి నోటు మాటే లేదు.

 

‘మంచి పనిచేశారు,  నెల కిందట నేను లెటర్ రాసి ఆనోట్లను రద్దు చేయమన్నా’ నని ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విలేకరుల సమావేశం పెట్టి ప్రకటించారు. దీనితో  వేయి నోటు చరిత్ర ముగిసిందని అనుకున్నారు.

 

 వేయి రుపాయల నోటు బెడద పోయిందని అంతా అనుకుంటున్నపుడు రెండు రోజుల తిరక్క ముందే  ఆర్థిక శాఖ ఆ నోటుకు మళ్లీ ప్రాణ ప్రతిష్ట చేసింది. దీనితో అందరికంటే అసంతృప్తి చెందిన చంద్రబాబు నాయుడే. ఆయన ఒప్పుకోలేదు. వేయినోటవసరం లేదన్నారు.

 

 ఆయన మాటను ఖాతరు చేయకుండా వేయి నోటును ఛలామణి లోకి తీసుకువస్తున్నట్లు ఆర్ధిక శాఖ   కార్యదర్శి శక్తికాంత దాస్ ప్రకటించారు. ప్రధాని రద్దు ప్రకటన తర్వాత 48 గంటల లోపే ఈ ప్రకటన వచ్చింది.

 

అదే రోజు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్టీ కూడా మరింత వివరణ ఇస్తూ వేయినోటు పునర్జన్మ నిజమే అన్నారు. ’ వేయి నోటు ముద్రించాలనుకుంటున్నాం. అదింకా భద్రంగా, చక్కగా ముస్తాబై వస్తుంది.  తొందర్లో మీ చేత్తుల్లో  పెళపెళలాడు తుంది,‘ ప్రకటించారు. అంతేకాదు, మేం చేసింది పెద్ద నోట్ల రద్దు కాదు, పాత నోట్ల రద్దు మాత్రమే నని కూడా ఆయన వివరించారు. దీనితో వేయి నోటు పునరాగమనం ఖాయమయింది.

 

అంతా ఈ నోటు కోసం ఎదురుచూస్తున్నారు. రెండు వేల నోటు కంటే వేయి నోటు కచ్చితంగా మేలనుకుంటున్నారు.  బజారులో ఎక్కడో ఒక చోట దానికి చిల్లర దొరక్క పోదని బ్యాంకుల దగ్గిర,  ఎటిఎంల దగ్గిర క్యూలో నిలబడి, రెండువేల నోటు చేతిలో పడకుండా చూడు భగవాన్ అంటూ ప్రజలు   ప్రార్థన చేస్తున్నపుడు  మరొక వార్త వచ్చింది.

 

 ఈ సారి అరుణ్ జైట్లీ  టివిల ముందుకొచ్చి తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు చెప్పారు.

 

‘ గతంలో చెప్పినట్లు వేయి రుపాయల నోటు రావడం లేదు. ముద్రించాలనుకోవడం లేదు. వేయి నోటు ఇప్పటియితే రాదు, ’అని చెప్పారు. అయితే, వేయి నోటు పూర్తిగా చావలేదుని, ఇప్పటికి మాత్రం లేదని ఆయనస్పష్టంగా చెప్పారు కాబట్టి ఆ నోటు ఎపుడయినా మన తలుపులు తట్టవచ్చని చెబుతున్నారు.

 

ఇంత అనాలోచితంగా,నిలకడ లేకుండా ప్రభుత్వం నిర్ణయాలుతీసుకోవడం, మార్చడం, రద్దు చేయడం,తాత్కాలికంగా పెండింగులో ఉంచడం  చేస్తున్నది.

 

ప్రభుత్వవర్గాల్లో వినబడుతున్న గుసగుసల ప్రకారం నోట్ల ముద్రణ రద్దీ తీరాక వేయి నోటుమళ్లీ ప్రత్యక్షమవుతుందని,  అయిదొందలకు, రెండువేలకు మధ్య మరొక నోటు లేకపోతే  సమస్యలొస్తాయని ఆర్థిక శాఖ ఎపుడో ఒక నిర్ణయానికి వచ్చిందట.  రెండు వేల నోటుతో సతమతమవుతున్న  ప్రజలకు వేయి కంటే, అయిదొందల నోటు అందివ్వడం అవసరమని భావించి ఇప్పటికి  ఈ నిర్ణయాన్ని  వాయిదా వేసుకున్నట్లు  ఈ వర్గాలు చెబుతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios