మొబైల్ డేటా, వైఫై సదుపాయం లేకుండా..ఆన్ లైన్ లో మీ స్నేహితులకు మెసేజ్ చేయగలరా..? ఆన్ లైన్ లో వార్తలు చదవగలరా..? ఇప్పటి వరకు ఇది సాధ్యం కాకపోవచ్చు. కానీ ఇక ముందు మాత్రం ఇది సాధ్యమే. మీరు చదివింది నిజమే.. ఇక నుంచి మీ ఫోన్ మొబైల్ డేటా లేకపోయినా మీ స్నేహితులతో చాటింగ్ చేసుకోవచ్చు. ఈ సదుపాయాన్ని ‘‘హైక్ ’’ యాప్ అందుబాటులోకి తీసుకువస్తోంది. దీని కోసం హైక్ లో ‘‘ టోటల్ ’’ అనే ఫీచర్ ని ప్రవేశపెట్టింది.

క్రికెట్ స్కోర్, జ్యోతిష్యం లాంటివి తెలుసుకోవడానికి, రైల్‌ టికెట్ల బుకింగ్‌కు, నగదు బదిలీకి, చెల్లింపులకు కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని హైక్ ప్రకటించింది. అయితే ఫోటోలను పంపుకునే సదుపాయం మాత్రం లేదు. తన వినియోగదారుల సంఖ్యను మరింత పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకోసం 4జీ స్పీడ్‌తో 20 ఎంబీ డేటా ప్యాకేజీలను రూ. 1 కే అందిస్తోంది. ఇప్పటికే ఇందుకోసం ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఎయిర్‌సెల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌తో ఒప్పందం చేసుకుంది. కాగా రిలయన్స్‌ జియో తదితర సంస్థలతో కూడా చర్చలు జరుపుతోంది.