Asianet News TeluguAsianet News Telugu

దీపక్ రెడ్డి, సక్సేనా ఇలా భూములు కొట్టేసే వారు

హైదరాబాద్ లో  భూములు కాజేసేందుకు ఆంధ్ర ప్రదేశ్ తెలుగుదేశం ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, ఆయన సహ కుట్రదారు బి.శైలేష్‌ సక్సేనా అనే న్యాయవాది ఆడుతున్న నాటకమొకటి పక్కాగా హైకోర్టు ముందు వెల్లడయింది. బోగస్ వ్యక్తులను సృష్టించి, వారి పేరుతో కోర్టులలో భూములు మావేనని  కేసుకువేయించి, అమాయకులను కోర్టు కీడ్చి భూములు కాజేయడం వారి అలవాటు. 

high court exposes the land grabbing  modus operandi of Deepak Reddy and advocate saxena

హైదరాబాద్ లో  భూములు కాజేసేందుకు ఆంధ్ర ప్రదేశ్ తెలుగుదేశం ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, ఆయన సహ కుట్రదారు బి.శైలేష్‌ సక్సేన అనే న్యాయవాది ఆడుతున్న నాటకమొకటి పక్కాగా హైకోర్టు ముందు వెల్లడయింది.

 

బోగస్ వ్యక్తులను సృష్టించి, వారిపేరుతో కోర్టులలో భూములు మావేనని  కేసుకువేయించి ఇంతవరకు దందా చేస్తూ వచ్చారు. అయితే, ఇపుడు అసులు వ్యక్తులు కోర్టుకు రావలసిందేనని హైకోర్టు కచ్చితంగా చెప్పడంతో దీపక్ రెడ్డి బండారం బయపడింది. కోర్టులో పిటిషన్ లు వేసిన వారు అసలు ఉనికిలో లేరని కోర్టు అభిప్రాయపడి, సక్సేనా వేసిన పటిషన్లు కోట్టివేసింది. ఈ కుట్రలో సక్సేనా తండ్రి కూడా మంచి పాత్ర పోషించే వాడు.

 

దీపక్‌రెడ్డి, సక్సేనాలు వేస్తున్న కేసుల మీద అనుమానం వచ్చిన కోర్టు  భూముల యజమానులమని చెప్పుకుంటూ పిటిషన్లు వేసిన వారు స్వయంగా  హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. వారెవరూ కోర్టు ఎదుట హాజరు కాలేదు. దీనితో ఇదంతా మోసమని కోర్టు పసిగట్టింది. లేని వ్యక్తుల పేర్లతో దాఖలైన 14 పిటిషన్లను కొట్టివేసింది. తప్పుడు పిటిషన్లు దాఖలు చేసిన సక్సేనాపై పోలీసులకు ఫిర్యాదు చేయా లని రిజిస్ట్రార్‌ (జ్యుడీషియల్‌) వెంకటేశ్వర రెడ్డిని ఆదేశించింది. ఈ కేసులకు సంబంధించిన ఫైళ్లు ఎలా మాయమయ్యాయో కూడా విచారించాలని కోర్టు ఆదేశించయింది. హైకోర్టు సిబ్బంది ప్రమేయంపైనా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పింది.  ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రామలింగేశ్వర రావు మంగళవారం ఆదేశాలిచ్చారు.

 

ఇదీ కథ


 హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్, భోజగుట్ట ప్రాంతంలో కొంత భూమిని ప్రభుత్వం అయోధ్య నగర్‌ మ్యూచువల్‌ ఎయిడెడ్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌కి కేటాయించింది. దీనికి సంబంధించి 2008లో జీవో 455 జారీ అయింది.

 

ఈ భూమిపై దీపక్‌రెడ్డి, సక్సేనాలు కన్నేశారు. కాజేసేందుకు కుట్ర పన్నారు.

 

ఆ భూమి అసలు యజ మాని జస్టిస్‌ సర్దార్‌ అలీఖాన్‌ వారసులంటూ ఇక్బాల్‌ ఇస్లాంఖాన్, నజీముద్దీన్‌ ఇస్లాంఖాన్, హబీద్‌ ఇస్లాంఖాన్, ఇప్తేకర్‌ ఇస్లాంఖాన్, షకీల్‌ ఇస్లాంఖాన్‌ పేర్లతో సృష్టించారు.శివభూషణం అనే వ్యక్తిని పట్టుకుని ఇక్బాల్‌ ఇస్లాం ఖాన్‌గా నామకరణం చేశారు. ఆపైన భోజగుట్ట భూమికి సంబంధించి భూ ఆక్రమణల నిరోధక న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు.ఇక్బాల్‌ వారసుడు షకీల్‌ ఇస్లాంఖాన్‌ గా నటించాలని

 

 బషీర్‌ అనే వ్యక్తినిపట్టు కొచ్చారు. భోజగుట్ట భూమి తనదేనంటూ 2008, 2009, 2012లో హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు అతగాడితో దాఖలు చేయించారు. షకీల్‌ తమకు భూమిని విక్రయిం చాడని, అయోధ్య సొసైటీకి జరి పిన కేటాయింపులు రద్దు చేయాలని తన తండ్రికి చెందిన జై హనుమాన్‌ ఎస్టేట్స్‌ సంస్థ, దీపక్‌రెడ్డి, మరొకరితో 2014 పిటిషన్లు వేయించారు.అసలు ఏమి జరుతుతున్నదో అయోధ్యనగర్‌ సొసైటీ ప్రతినిధులు కోర్టు ముందుంచారు.దీనితో  పిటిషనర్లు ఇక్బాల్, ఆధార్‌కార్డులతో సహా కోర్టు ముందుకు రప్పించాలని వారుకోరారు. ఈవాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి షకీల్, నజీముద్దీన్, హబీద్, ఇప్తేకర్‌ తదితరులు స్వయంగా కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించారు.

 

అంతే, బండారం బయటపడింది.

 

Follow Us:
Download App:
  • android
  • ios