శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు సమీపిస్తుండటంతో ముందస్తు జాగ్రత్తగా హై అలర్ట్ ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. ఎయిర్ పోర్టు ఎంట్రీ వద్ద శుక్రవారం నుంచి వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. విమానాశ్రయంలో ఈ నెల 31 వరకు విజిటర్ పాసులను నిలిపివేశారు. విమాన ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతనే లోపలికి అనుమతిస్తున్నారు. సీఐఎస్ఎఫ్‌, సైబరాబాద్‌ పోలీసులు, బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్వ్కాడ్‌, ఇంటెలిజెన్స్‌ అధికారులు బందోబస్తులో నిమగ్నమయ్యారు. అనుమానాస్పదంగా ఎవరైనా విమానాశ్రయం పరిసరాల్లో తచ్చాడితే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.