ప్రముఖ ద్విచక్రవాహనాల తయారీ సంస్థ హీరో నుంచి మరో సరికొత్త బైక్ మార్కెట్ లోకి అడుగుపెట్టనుంది. 150సీసీ విభాగంలో హీరో నుంచి విడుదలైన ఎక్స్ ట్రీమ్ బైక్ లు భారత మార్కెట్ లో విపరీతంగా అమ్ముడయ్యాయి. కాగా.. ఇప్పుడు అదే మోడల్ బైక్ ని  200 సీసీ విభాగంలో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. బైక్ ఇతర ఫీచర్లు, ధర తదితర వివరాలను ఈ ఏడాది ఏప్రిల్ లో తెలియజేయనున్నట్లు హీరో కంపెనీ వెల్లడించింది.

కొత్త ఎక్స్‌ ట్రీమ్‌ 200ఆర్‌లో సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్‌ 8500 ఆర్‌పీఎం వద్ద 18.4 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. ట్రాఫిక్‌లో కూడా సులభంగా నడపటానికి వీలుగా ఈ ఇంజిన్‌ను తయారు చేసినట్లు హీరో పేర్కొంది. ఈ బైకుకు సింగిల్‌ ఛానల్‌ ఏబీఎస్‌ను ఆప్షనల్‌గా అందజేశారు. హీరో మోటార్‌సైకిళ్లలో తొలిసారిగా ఈబైకుకు రేడియల్‌ టైర్లను అమర్చారు.