నాకు తెలిసీ ఆయన ది బెస్ట్.. అలాంటి వ్యక్తిని ఇలా చేస్తారా?

First Published 9, Apr 2018, 1:31 PM IST
hero sumanth tweet goes viral over tdp MP galla jayadev
Highlights
ట్విట్టర్ లో ఆగ్రహం వ్యక్తం చేసిన సుమంత్

రాజకీయాలకు అక్కినేని కుటుంబం దాదాపు దూరంగానే ఉంటుంది. సినిమాల గురించి తప్ప.. ఏనాడు రాజకీయాల గురించి చర్చించరు. అలాంటిది అక్కినేని కుటుంబానికి చెందిన హీరో సుమంత్ మాత్రం తొలిసారిగా ఈ విషయంపై స్పందించారు.

ఇంతకీ విషయం ఏమిటంటే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఒకవైపు టీడీపీ, మరోవైపు వైసీపీ నేతలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలో భాగంగా ఏకంగా ప్రధాని నివాసమే లక్ష్యంగా టీడీపీ ఎంపీలు దండెత్తారు. మోదీ హయాంలో ఇప్పటి వరకూ ఏ పార్టీ ఎంపీలూ చేయని రీతిలో ఆయన ఇంటి ముందే ఆదివారం మెరుపు ధర్నాకు దిగారు. నవ్యాంధ్రకు న్యాయం చేయాలంటూ నినదించారు.ఎంపీలని కూడా చూడకుండా వారిని బలవంతంగా లాగిపడేశారు.

 

కాగా.. ఆ ఫోటోలను ఎంపీ గల్లా జయదేవ్ తన ట్విట్టర్ లో పోస్టు చేయగా.. దానికి హీరో సుమంత్ స్పందించారు. ‘నాకు తెలిసిన వ్యక్తుల్లో ది బెస్ట్ అయిన గల్లా జయదేవ్‌కు ఇలా జరగడం చూస్తుంటే చాలా బాధగా ఉంది’ అంటూ సుమంత్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం సుమంత్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

loader