పవన్ పై శ్రీరెడ్డి ఆరోపణలకు.. సుప్రీం హీరో సమాధానం

యాంకర్ శ్రీరెడ్డి తెలుగు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అంటూ సంచలనానికి తెరలేపిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే.. ఇటీవల శ్రీరెడ్డి సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో
విరుచుకుపడింది. నువ్వేమీ నాకు ఉచిత సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ పవన్‌పై ఓ రేంజ్‌లో మండిపడుతోంది శ్రీ రెడ్డి. ప్రస్తుతం జరుగుతున్న ఈ పరిణామాలు అంతటా హాట్‌టాపిక్‌గా మారాయి. ఇప్పటికే ఈ ఘటనపై హీరో నితిన్.. శ్రీరెడ్డికి వార్నింగ్ ఇవ్వగా.. తాజాగా ఈ ఘటనపై పవన్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ స్పందించారు. శ్రీరెడ్డి అన్ని ఆరోపణలు చేసినా.. పవన్ ఎందుకు మౌనంగా ఉంటున్నాడో ఓ వీడియో ద్వారా తెలియజేశాడు.

Scroll to load tweet…


ఈ వీడియోలో పవన్ తన కార్యకర్తలతో మాట్లాడుతూ.. ‘‘కష్టాలుంటాయ్.. పాలిటిక్స్‌లో.. నన్ను తిడుతుంటే ఒక్కోసారి మీకు ఇబ్బంది కలగొచ్చు. నేను భరిస్తాను.. బలవంతుడే భరిస్తాడు. మనం బలమైన వ్యక్తులం.. భరిద్దాం. భరించిన వాడే సాధించగలడు. అంతేగానీ మాట అనేసారు కదా అని పారిపోతే ఎట్లా.. అలా అయితే నిన్ను తిట్టేవారు విజయం సాధించినట్లు. అలా పారిపోవద్దు దేన్నుంచి. అలా అనిచెప్పి ఎదురుదాడి చెయ్యొద్దు. భరించండి.. చూడండి.. ఎంతసేపంటారో చూడండి. మార్పు చాలా సైలెంట్‌గా అదే వచ్చేస్తుంది. భరించడం వల్ల వచ్చేశక్తి చాలా బలమైన శక్తి మన లోపలినుంచి’’ అన్నారు. సాయిధరమ్ తేజ్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. శ్రీరెడ్డి సరిగ్గా సమాధానం చెప్పారంటూ పవన్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.