నిఖిల్ సినీ పరిశ్రమలో అడుగుపెట్టి పదేళ్లు గడిచిపోయింది పెద్దలు కుదర్చిన పెళ్లే చేసుకుంటున్నట్లు ఆయన చెప్పారు
‘హ్యపీ డేస్’ చిత్రంతో తెరంగేట్రం చేసిన నటుడు నిఖిల్. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందిన నిఖిల్.. ‘కార్తికేయ’ ‘ ఎక్కడికి పోతావు చిన్నవాడ’, ‘ కేశవ’ వంటి వరస చిత్రాల విజయాలతో మంచి ఫామ్ లో ఉన్నాడు. నిఖిల్ సినీ పరిశ్రమలో అడుగుపెట్టి పదేళ్లు గడిచిపోయింది. చేసింది 16 సినిమాలే అయినా.. తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు. కెరియర్ పరంగా సెటిల్ అయ్యాడు కనుక.. ఇక జీవితంలోనూ సెటిల్ కావాలని నిర్ణయించుకున్నాడు కాబోలు.. అందుకే త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. ఈ విషయాన్ని నిఖిల్ స్వయంగా తెలియజేశారు.
తనది ప్రేమ వివాహం కాదని... పెద్దలు కుదర్చిన పెళ్లే చేసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఈ నెల 24 వ తేదీన నిశ్చితార్థం.. అక్టోబర్ 1వ తేదీన పెళ్లి జరగనుంది. ప్రముఖ వ్యాపారవేత్త ఆంజనేయులు యాదవ్ కుమార్తె తేజశ్విని ని ఆయన వివాహం చేసుకున్నారు. ఆమె తనకు దగ్గరి బంధువు అవుతుందని నిఖిల్ చెప్పారు.
ప్రస్తుతం నిఖిల్ ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఓ చిత్రంలో నటిస్తున్నారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో నటీనటుల ఎంపిక జరుగుతోంది. తాజాగా నిఖిల్ జిమ్ బిజినెస్‌ను ప్రారంభించారు.
