ఈ రోజు అర్థ రాత్రి నుంచి జిఎస్ టి, ఒక దేశం-ఒకే పన్ను విధానం,అమలులోకి రాగానే మన కోనుగోళ్లలో చాలా మార్పులు రాబోతున్నాయి. 

అనేక  వస్తువుల ధరలు తగ్గుతాయని చెబుతున్నారు. అలాగే కొన్నింటి ధరలు పెరగునున్నాయి. ప్రపంచంలోో జిఎస్ టి ప్రవేశపెట్టిన తర్వాత  అనేక పెను మార్పలువచ్చాయి. కొన్నచోట్ల ఇవి మార్కెట్ కు, కుటుంబాలకే పరిమితం కాకుండా ప్రభుత్వాల భవితవ్యం కూడా నిర్ణయించాయి.

భారత దేశంలో ఎమవుతుందో ఇపుడే చెప్పలేం. అయితే, ఒక సారి ఈ అర్థరాత్రి నుంచి మార్కెట్ ధరల్లో జరగబోయే కొన్ని మార్పులు ఇవి:

 

 

టీ పౌడర్ : ప్రస్తుతం : 29%,  GST తర్వాత 18%(తగ్గుతుంది)

కాఫీ పౌడర్ : ప్రస్తుతం : 29%, GST తర్వాత 18శాతం (తగ్గుతుంది)

చక్కెర : ప్రస్తుతం 10%, GST తర్వాత 5శాతం (తగ్గుతుంది)

నెయ్యి : ప్రస్తుతం 5%, GST తర్వాత 12శాతం (పెరుగుతుంది)

వెన్న : ప్రస్తుతం 14.5%, GST తర్వాత 12శాతం (తగ్గుతుంది)

హెయిర్ ఆయిల్ : ప్రస్తుతం 29%, GST తర్వాత 18శాతం (తగ్గుతుంది)

టూత్ పేస్ట్ : ప్రస్తుతం 29%, GST తర్వాత 18శాతం (తగ్గుతుంది)

సబ్బులు : ప్రస్తుతం 29%, GST తర్వాత 18శాతం (తగ్గుతుంది)

బ్రాండెడ్ రైస్ : ప్రస్తుతం లేదు. GST తర్వాత 5శాతం (పెరుగుతుంది)

( 10కేజీల రైస్ బ్యాగ్ 25రూపాయలు పెరుగుతుంది)

చాక్లెట్లు, బిస్కెట్లు : ప్రస్తుతం 29%, GST తర్వాత 18శాతం (తగ్గుతుంది)

బర్త్ డే, ఇతర కేకులు : ప్రస్తుతం 29%, GST తర్వాత 18శాతం (తగ్గుతుంది)

ఐస్ క్రీమ్స్ : ప్రస్తుతం 29%, GST తర్వాత 18శాతం (తగ్గుతుంది)

మొబైల్ ఫోన్స్ : ప్రస్తుతం 6%, GST తర్వాత 12శాతం (పెరుగుతాయి)

కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు : ప్రస్తుతం 6%, GST తర్వాత 18శాతం (పెరుగుతాయి)

ఫర్నీచర్ : ప్రస్తుతం 29%, GST తర్వాత 12శాతం (తగ్గుతాయి)

ఆయుర్వేద మందులు : ప్రస్తుతం 10%, GST తర్వాత 12శాతం (పెరుగుతాయి)

బ్రాండెడ్ నూడుల్స్ : ఒక శాతం పెరుగుతున్నాయి.

కూల్ డ్రింక్స్ : ఒకశాతం పెరుగుతున్నాయి.

పిజ్జా, బర్గర్స్ : మూడు శాతం తగ్గుతున్నాయి. ప్రస్తుతం రూ.100 ఉంటే.. GST తర్వాత రూ.97 అవుతుంది.

చెప్పులు, బూట్లు ధరల్లో మార్పులు ఇలా :

రూ.1000 పైన : ప్రస్తుతం 26.5%, GST తర్వాత 18శాతం (తగ్గుతాయి)

రూ.500-1000 మధ్య ఉంటే : ప్రస్తుతం 20.5%, GST తర్వాత 18శాతం (తగ్గుతాయి)

రూ.500లోపు ఉంటే : ప్రస్తుతం 5%, GST తర్వాత 5శాతం (మార్పు లేదు)

రెడీమేడ్ దుస్తులు ధరల్లో మార్పులు ఇలా :

రూ.1000పైన కొనుగోలు చేస్తే : ప్రస్తుతం 12%, GST తర్వాత 4.5శాతం (తగ్గుతాయి)

రూ.1000లోపు కొనుగోలు చేస్తే : ప్రస్తుతం 5%, GST తర్వాత 2.5శాతం (తగ్గుతాయి)

టీవీలు : ప్రస్తుతం 26%, GST తర్వాత 28శాతం (పెరుగుతాయి)

వాషింగ్ మెషీన్ : ప్రస్తుతం 26%, GST తర్వాత 28శాతం (పెరుగుతుంది)

ఫ్రిడ్జ్ : ప్రస్తుతం 26%, GST తర్వాత 28శాతం (పెరుగుతుంది)

మెక్రోఓవెన్ : ప్రస్తుతం 26%, GST తర్వాత 28శాతం (పెరుగుతుంది)

వైద్య పరికరాలు : ప్రస్తుతం 18%, GST తర్వాత 12శాతం (తగ్గుతాయి)

సిమెంట్ : ప్రస్తుతం 29%, GST తర్వాత 28శాతం (తగ్గుతుంది)

పెద్ద వాహనాలు (కమర్షియల్) : ప్రస్తుతం 30%, GST తర్వాత 28శాతం (తగ్గుతాయి)

SUV కార్లు : ప్రస్తుతం 55%, GST తర్వాత 43శాతం (తగ్గతాయి)

లగ్జరీ కార్లు : ప్రస్తుతం 49%, GST తర్వాత 43శాతం (తగ్గుతాయి)

మీడియం కార్లు : ప్రస్తుతం 47%, GST తర్వాత 43శాతం (తగ్గుతాయి)

చిన్నకార్లు : ప్రస్తుతం 30%, GST తర్వాత 29శాతం (తగ్గుతాయి)

బైక్స్ : ప్రస్తుతం 30%, GST తర్వాత 28శాతం (తగ్గుతాయి)